🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 23 Sep, 2026 | Page: 1

బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట..

గత కొద్ది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం మళ్లీ పుంజుకున్నాయి. పసిడి ధరలు ఒక్కసారిగా యూటర్న్‌ తీసుకుని పెరుగుదల నమోదు చేశాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ధరల కదలికలు మరోసారి ఆసక్తికరంగా మారాయి.గుడ్‌రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. బుధవారం హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,200గా నమోదైంది. మంగళవారం ధరతో పోలిస్తే ఇది రూ.870 పెరిగింది. దీంతో ఇటీవల వరుసగా తగ్గిన పసిడి ధరలకు స్వల్పంగా ఊరట లభించినట్లైంది.ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. బుధవారం హైదరాబాద్‌, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటల్‌ బంగారం ధర రూ.1,41,350గా ఉంది. మంగళవారం ధరతో పోలిస్తే ఇది రూ.800 మేర పెరిగింది.బంగారం ధరల్లో రోజువారీ మార్పులకు అంతర్జాతీయ మార్కెట్‌ పరిణామాలు కీలకంగా ఉంటాయి. అమెరికా డాలర్‌ కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర, ముడిచమురు ధరలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారుల కొనుగోళ్ల ధోరణి వంటి అంశాలు బంగారం రేట్లను ప్రభావితం చేస్తుంటాయి.ఇటీవల బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్‌లో కొంత ఊరట కనిపించింది. అయితే బుధవారం మళ్లీ ధరలు పెరగడంతో పసిడి మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
🏠 Home