🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 23 Sep, 2026 | Page: 1

రైతుల దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం..!

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసింది. బుధవారం ఉదయం 8 గంటలకు కూడి ఎడమ కాలువల వద్దకు చేరుకున్న అధికారులు తూములను తెరిచి కిందికి నీళ్లను వదిలిపెట్టారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకు 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ఇన్‌ఫ్లోను ఇలాగే ఒడిసి పడితే పూర్తిస్థాయిలో నిండి ఏకంగా స్పిల్ గేట్లను తెరవాల్సిన పరిస్థితి వస్తుంది.ఇదే జరిగితే మళ్లీ కిందికి నీళ్లు వెళతాయి. రైతాంగం ఆగ్రహం మరింత పెళ్లుబికుతుందని భయపడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హుటాహుటిన కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల చేయాలని అధికారులు కోరిన పట్టించుకోకపోవడంతో.. చివరకు అధికార యంత్రాంగమే కుడి, ఎడమ కాలువలకు నీళ్లు విడుదల చేయడం గమనార్హం. మొత్తం మీద రైతుల పోరాటం ఫలించి ప్రభుత్వం దిగివచ్చి కుడి, ఎడమ కాలువలకు నీళ్లు విడుదల చేయడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
🏠 Home