అంతరంగంలో ఆనందం
వెతికితే దొరికేది కాదు
ఆనందం కోరుకుంటే
లభించేది కాదు
సంతోషం ఆశల అన్వేషణ
ఆగిపోయిన క్షణాన
మనసు నిశ్శబ్దంగా
మారిన వేళ ఆహ్వానం
లేకుండానే
అప్రయత్నంగా వస్తుంది .
జిడ్డు కృష్ణమూర్తి.
ఆనందం ఎక్కడో లేదు
అది మన మనసులో
ఉంటుంది
ఆనందాన్ని ఎదుటి వారి
నవ్వుల్లో వెతుకద్దు
ఎండమావులవైపు
పరుగెత్తవద్దు
నీలోపల ఉన్న ఊటా
నీ ఆలోచనల తోట
మనిషికి నిజమైన ఆనందం
అధికారం బంగారు నగల్లో లేదు
ఆనందం సిరిసంపద కోటల్లో లేదు
ఆలోచనల్లో ప్రవర్తనలో
దృక్పథంలో ఉంటుంది
మనసుకు ఆనందం కలిగించే
సమాజ హిత కార్యాల్లో
ఉంటుంది
సంతోషం బయట ప్రపంచంలో
వెతకడంఆపితే నీఅంతరంగంలోనే
కనిపిస్తుంది ఆ సత్యాన్ని మరవద్దు
పక్షుల కిలకిల రావాల
చిరు సవ్వడిలో ప్రకృతిలో
పారే సెలయేటి స్వచ్ఛమైన
అలలలో ఆటపాటల్లో సృజన
నటనలో ఆనందం దాగి వుంది
చిరునవ్వుతో రోజును ప్రారంభించి
చిన్న విషయాలకే మురిసిపోతే
కష్టాలను సైతం సవాలుగా చూస్తే
ఆనందం నీ నీడై నీతో నడుస్తుంది
ఇతరుల జీవితాల్లో చిన్న
ఆనందాన్ని కలిగిస్తే అది
మన జీవితానికి వెలుగునిస్తుంది
పదిమందితో మనం ఉంటే
పదిమందికి మేలు జరిగితే
మనకు జరుగుతుంది
తోటి వారికి సాయం చేసే
చేతులలో నిజమైన
ఆనందం దాగిఉంది
సహకారం గౌరవం
సంఘీభావ సహనం
సుఖమయమైన
జీవితానికి దారులు
దీన్నిగుర్తించినవారే
నిజమైన ఆనందం
అనుభవిస్తారు
గతాన్ని తలచి కుంగిపోకు
నిన్నటి జ్ఞాపకాల భారంతో
పొంగిపోకు భవిష్యత్తును
చూసి భయపడకు
రేపటి ఆందోళనల
నీడలో నలిగిపోకు
చేతిలో ఉన్న ఈ ఒక్క క్షణాన్ని
ప్రేమిస్తే ఆనందం నీ గుండె
చప్పుడుగా మారుతుంది
ఆనందం నీదోసిట్లో వాలుతుంది
నువ్వు ఆలోచించే ఆలోచనలు
నువ్వు మాట్లాడే మాటలు
నువ్వు చేసే పనులు ఈ మూడు
ఎప్పుడూ ఒకటిగా సాగుతాయో
అప్పుడే నీ జీవితం పరమానందం
భరితం అవుతుంది
సయోధ్య నిజమైన ఆనందం
నువ్వు ఆలోచించేది చెప్పేది
చేసేది ఈ మూడు పరస్పర
సామరస్యంతో ఏకమైనప్పుడే
నిజమైన ఆనందం సిద్ధిస్తుంది
మహాత్మా గాంధీ.
ఓటమిని గెలుపుకు
మెట్టుగా మార్చు కోవాలి
కృతజ్ఞతతో ప్రతి రోజు
గడపాలి
నీ సుఖానికి నీవే శిల్పివి
నీఆనందానికి నీవే బాధ్యుడివి
జనం నచ్చేలా జగం మెచ్చేలా
జీవించాలి అనే భావం
నీజీవితానికి దిక్సూచి కావాలి
జీవితం విలువ తెలుసుకొని
మంచి ఆలోచనలతో మంచిని
పెంచి మంచిని పంచి సమాజ
హితమే నీ జీవిత పరమావధి కావాలి
ఆనందం బయట వెతికే వస్తువు
కాదు మార్కెట్లో కొంటె దొరకదు మన ఆలోచనల్లో మన చేతుల్లో
మన హృదయంలో మన జీవన
విధానంలో పుట్టే వెలుగు
ఈ వెలుగును మన మనసులో
సుస్థిరం చేసుకుంటే జీవితం
సార్ధక మౌతుంది
ఆనందమే సమాజ
జీవనశైలి కావాలి
ఆనందం పునాదులపై
వికసిత భారత్ లక్ష్య
సాధనకు ఉద్యమిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్
9440245771
ఆనందం కోరుకుంటే
లభించేది కాదు
సంతోషం ఆశల అన్వేషణ
ఆగిపోయిన క్షణాన
మనసు నిశ్శబ్దంగా
మారిన వేళ ఆహ్వానం
లేకుండానే
అప్రయత్నంగా వస్తుంది .
జిడ్డు కృష్ణమూర్తి.
ఆనందం ఎక్కడో లేదు
అది మన మనసులో
ఉంటుంది
ఆనందాన్ని ఎదుటి వారి
నవ్వుల్లో వెతుకద్దు
ఎండమావులవైపు
పరుగెత్తవద్దు
నీలోపల ఉన్న ఊటా
నీ ఆలోచనల తోట
మనిషికి నిజమైన ఆనందం
అధికారం బంగారు నగల్లో లేదు
ఆనందం సిరిసంపద కోటల్లో లేదు
ఆలోచనల్లో ప్రవర్తనలో
దృక్పథంలో ఉంటుంది
మనసుకు ఆనందం కలిగించే
సమాజ హిత కార్యాల్లో
ఉంటుంది
సంతోషం బయట ప్రపంచంలో
వెతకడంఆపితే నీఅంతరంగంలోనే
కనిపిస్తుంది ఆ సత్యాన్ని మరవద్దు
పక్షుల కిలకిల రావాల
చిరు సవ్వడిలో ప్రకృతిలో
పారే సెలయేటి స్వచ్ఛమైన
అలలలో ఆటపాటల్లో సృజన
నటనలో ఆనందం దాగి వుంది
చిరునవ్వుతో రోజును ప్రారంభించి
చిన్న విషయాలకే మురిసిపోతే
కష్టాలను సైతం సవాలుగా చూస్తే
ఆనందం నీ నీడై నీతో నడుస్తుంది
ఇతరుల జీవితాల్లో చిన్న
ఆనందాన్ని కలిగిస్తే అది
మన జీవితానికి వెలుగునిస్తుంది
పదిమందితో మనం ఉంటే
పదిమందికి మేలు జరిగితే
మనకు జరుగుతుంది
తోటి వారికి సాయం చేసే
చేతులలో నిజమైన
ఆనందం దాగిఉంది
సహకారం గౌరవం
సంఘీభావ సహనం
సుఖమయమైన
జీవితానికి దారులు
దీన్నిగుర్తించినవారే
నిజమైన ఆనందం
అనుభవిస్తారు
గతాన్ని తలచి కుంగిపోకు
నిన్నటి జ్ఞాపకాల భారంతో
పొంగిపోకు భవిష్యత్తును
చూసి భయపడకు
రేపటి ఆందోళనల
నీడలో నలిగిపోకు
చేతిలో ఉన్న ఈ ఒక్క క్షణాన్ని
ప్రేమిస్తే ఆనందం నీ గుండె
చప్పుడుగా మారుతుంది
ఆనందం నీదోసిట్లో వాలుతుంది
నువ్వు ఆలోచించే ఆలోచనలు
నువ్వు మాట్లాడే మాటలు
నువ్వు చేసే పనులు ఈ మూడు
ఎప్పుడూ ఒకటిగా సాగుతాయో
అప్పుడే నీ జీవితం పరమానందం
భరితం అవుతుంది
సయోధ్య నిజమైన ఆనందం
నువ్వు ఆలోచించేది చెప్పేది
చేసేది ఈ మూడు పరస్పర
సామరస్యంతో ఏకమైనప్పుడే
నిజమైన ఆనందం సిద్ధిస్తుంది
మహాత్మా గాంధీ.
ఓటమిని గెలుపుకు
మెట్టుగా మార్చు కోవాలి
కృతజ్ఞతతో ప్రతి రోజు
గడపాలి
నీ సుఖానికి నీవే శిల్పివి
నీఆనందానికి నీవే బాధ్యుడివి
జనం నచ్చేలా జగం మెచ్చేలా
జీవించాలి అనే భావం
నీజీవితానికి దిక్సూచి కావాలి
జీవితం విలువ తెలుసుకొని
మంచి ఆలోచనలతో మంచిని
పెంచి మంచిని పంచి సమాజ
హితమే నీ జీవిత పరమావధి కావాలి
ఆనందం బయట వెతికే వస్తువు
కాదు మార్కెట్లో కొంటె దొరకదు మన ఆలోచనల్లో మన చేతుల్లో
మన హృదయంలో మన జీవన
విధానంలో పుట్టే వెలుగు
ఈ వెలుగును మన మనసులో
సుస్థిరం చేసుకుంటే జీవితం
సార్ధక మౌతుంది
ఆనందమే సమాజ
జీవనశైలి కావాలి
ఆనందం పునాదులపై
వికసిత భారత్ లక్ష్య
సాధనకు ఉద్యమిద్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్
9440245771