🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Sep, 2026 | Page: 1

హాలీవుడ్‌కి విజయ్ సేతుపతి ‘మహారాజా’.. హీరోగా ఆస్కార్ నటుడు?

టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన విజయ్ సేతుపతి బ్లాక్‌బస్టర్ మూవీ ‘మహారాజా’ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కాబోతున్న‌ట్లు తెలుస్తుంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కంటెంట్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా హాలీవుడ్ రీమేక్‌కు సంబంధించిన వార్తలపై చిత్ర నిర్మాత సుధాన్ సుందరం స్పందించారు.ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆయన మాట్లాడుతూ.. మహారాజా రీమేక్ హాలీవుడ్ రైట్స్ కోసం అక్కడి ప్రముఖ ఏజెన్సీ మమ్మల్ని సంప్రదించిన‌ట్లు తెలిపారు. ప్రస్తుతం హాలీవుడ్‌లోని ఓ ప్రముఖ ఏజెన్సీ ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేసే ప్రయత్నాలలో ఉంది. ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో మాథ్యూ మెక్‌కానగీ తో పాటు మరికొంత మంది ప్రముఖ నటులతో చర్చలైతే నడుస్తున్నాయి. అయితే, ఏజెన్సీ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది అని వెల్లడించారు.
🏠 Home