వినాయక మాల వేసుకున్నారని..
గణేష్ నవరాత్రుల సందర్భంగా పలువురు విద్యార్థులు (గణేష్ దీక్ష) వినాయక మాల ధరించారు. మంగళవారం గణేష్ మాల (కండువా) ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్నారు. మాల విరమణ చేస్తేనే స్కూల్‌కు రావాలని స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులు, విద్యార్థులు తల్లిదండ్రులు ఆ ప్రైవేట్ స్కూల్‌కు చేరుకొని విద్యార్థులను ఎందుకు అడ్డుకున్నారని నిలదీశారు.దీంతో పాఠశాల ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా విద్యార్థులు తండ్రి కె. శ్రీకాంత్ మాట్లాడుతూ.. హనుమకొండ 4వ డివిజన్ మాదిరెడ్డికుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో తన కూతురు, కుమారుడు కొన్నేళ్లుగా చదువుతున్నారని చెప్పారు. ఈ నెల 14న వినాయక చవితి నేపథ్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది సైతం వినాయక మాలను ధరించి మంగళవారం వారు చదువుకునే పాఠశాలకు వెళ్లారన్నారు. అక్కడ ఉన్న టీచర్లు తమ పిల్లల్ని అడ్డుకున్నారని, మాలల ధరించి స్కూల్ రావొద్దని మందలించారని చెప్పారు.దీంతో పిల్లలు తనకు ఫోన్ చేసి చేసి స్కూల్‌లో జరిగిన ఘటన గురించి వివరించగా వెంటనే పాఠశాలకు వెళ్లానన్నారు. అక్కడ టీచర్లను అడగగా.. పాఠశాలకు విద్యార్థులు ఆధ్యాత్మిక మాలలు వేసి రాకూడదని, లేదంటే మాల విరమణ చేసి రావాలని చెప్పారన్నారు. ఎంత చెప్పినా పాఠశాల సిబ్బంది వినిపించుకోకపోవడంతో నగరంలోని ఏబీవీపీ, బజరంగ్‌దళ్, వీహెచ్‌పీ నాయకులకు సమాచారం ఇచ్చానన్నారు.