🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 15 Sep, 2026 | Page: 1

మన చేతుల్లోనే మన ఆనందం

మనిషి ఆనందం కోసం
వెతకద్దు ఆనందకర
జీవితానికి సూత్రం
ఆనందంగా జీవించాలని నిర్ణయించుకోవడమే
మన చేతుల్లో చేష్టల్లో
మన ఆనందం ఉంటుంది
ఆందోళన మానుకొని
ఆనందమే హద్దుగా
ఆలోచనలు సాగితే
అభివృద్ధి దృక్పథం
పెరుగుతుంది
ఆశావహ దృక్పథంతో
పనిసాధనలోఎదురయ్యే
సవాళ్లను ఎదుర్కోగలం
మనిషి ఒకేసారి అనేక
అంశాలపై దృష్టి పెట్టి
అపరిమిత కోరికలను
ఏకకాలంలో తీర్చుకోవడానికి తాపత్రయపడతాడు
అన్ని పనులు అట్టహాసంగా
మొదలు పెడతాడు
ఏ పని పూర్తి కాదు
మనస్ఫూర్తిగా చిన్న చిన్న
విషయాలను పై శ్రద్ధ పెట్టి
విజయం సాధిస్తే
దానివల్ల వచ్చే ఆనందాన్ని
మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాం
సంతృప్తి మనలో మరో
సంకల్పానికి బీజం వేస్తుంది
సృజనాత్మకతను పెంచుతుంది
ఎలాంటి పరిస్థితుల్లోనైనా
ఆనందంగా ఉండటం
అలవాటు చేసుకోవాలి
బాహ్య విషయాల్లో
ఆనందాన్ని వెతకడం
మానండి
ఆనందం ఆలోచన
అంతా మన అంతర్గత
ఆలోచన పరంపరపై
మానసిక స్థితిపై
ఆధారపడి ఉంటుంది
ఏకకాలంలో ఏ అంశాలకు
ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించండి
ఒకే అంశంపై గురిపెట్టండి
ఏకాగ్రత శ్రద్ధ శక్తి నిలిపితే
పదిరెట్లు ఎక్కువ కృషి చేస్తాం
నైపుణ్యం పెరిగి ఉత్పాదక శక్తి
సామర్థ్యం  ఇనుమడిస్తుంది
మనకు అమిత ఆసక్తి
కలిగించే అంశాన్ని గుర్తించాలి
దానిపైనే గురి పెట్టాలి
పట్టుదలతో ప్రగతి సాధనే
లక్ష్యంగా ముందుకు సాగాలి
సాకులు వెతకద్దు కార్యసాధనకు
సమాయాత్తం కావాలి
చేసే పనిపై స్థిరంగా ఓపికగా
ఉందాం పనిని ప్రేమిద్దాం
ప్రతికూల పరిస్థితుల్లో కూడా
ముందుకు సాగితే అభివృద్ధి
దానంతట అదే థరి చేరుతుంది
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
కరీంనగర్9440245771 
🏠 Home