🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 15 Sep, 2026 | Page: 1

ఇమ్రాన్‌కు బాసటగా ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)కు ఒకప్పటి క్రికెటర్ల మద్దుతు పెరుగుతోంది. తమతో కలిసి ఆడిన ఇమ్రాన్ జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్నందున.. అతడికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే భారత దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌ సహా 22 మంది పాక్ ప్రధానికి లేఖ రాశారు. తాజాగా ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు వీరితో కలిశారు. జైల్లో మగ్గుతున్న ఇమ్రాన్‌పై మానవత్వం చూపేలా ఒత్తిడి చేయాలని తమ దేశానికి చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌ను వీరంతా అభ్యర్థించారు.మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌కు మెరుగైన వైద్యం కోసం క్రికెట్ దిగ్గజాలు పట్టుపడుతున్నారు. మానవతాకోణంలో ఆలోచించి అతడికి మంచి చికిత్స అందించాలని ఇప్పటికే పలువురు డిమాండ్ చేయగా.. ఏడుగురు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు తాజాగా లేఖ రాశారు. పాక్ ప్రభుత్వం ఇమ్రాన్‌పై మానవత్వంతో వ్యవహరించేలా చొరవ తీసుకోవాలని ఆసీస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పెన్నీ వాంగ్‌కు వీరంతా ఉత్తరం పంపారు.‘రాజకీయవేత్తలుగా లేదా దౌత్యవేత్తలుగా కాదు.. మాజీ ఆటగాళ్లుగా ఈ అభ్యర్థన చేస్తున్నాం’ అని అలన్ బోర్డర్, స్టీవ్ వా, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, కిమ్ హుగెస్, మార్క్ టేలర్‌ బృందం పేర్కొంది. ‘ఇమ్రాన్‌పై ఉన్న రాజకీయ, చట్టపరమైన కేసుల గురించి మేం మాట్లాడడం లేదు. వారిమధ్య రాజకీయాలు ఎన్ని ఉన్నా సరే అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తికి మెరుగైన వైద్యం అందించడం కనీస మానవత్వం. ఆ దిశగా పాక్‌పై ఒత్తిడి పెంచేలా మీరు చొరవ తీసుకోండి’ అని పెన్నీ వాంగ్‌ను కోరారు లెజెండరీ కెప్టెన్లు.
🏠 Home