🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Sep, 2026 | Page: 1

ధైర్యంగా సాగుదాం బతికి సాదిద్దాం

మానసిక ఆరోగ్యానికి
మనో ధైర్యమే మందు
ఆత్మవిశ్వాసమే లక్ష్యంగా
ఆత్మహత్యలు నివారిద్దాం
సమస్యలను ఓడిధ్దాం
పోలికలు పోటీలు వద్దు
శాస్త్రీయ దృక్పథం ముద్దు
ఆందోళన వద్దు
అరమరికలు వద్దు
అభివృద్ధే ధ్యేయంగా
ముందడుగు  వేద్దాం
కష్టం నష్టం ఆవేదన
ఆక్రోశం అనిచ్చితి 
అభద్రతఒత్తిడితో
విలువైన జీవితాన్ని
చాలించవద్దు
బతికి సాధించాలి
జీవితంలోని ఆనందాన్ని
ఆస్వాదించాలి
సమస్యలకు చలించవద్దు
ఆర్థిక సమస్య కుటుంబ
సమస్య భార్యభర్తల గొడవ
పరిక్షల్లో ర్యాంకు తేలేదని
తల్లి తండ్రుల మందలింపు
సెల్ ఫోన్ కొనివ్వలేదనే 
క్షణికావేశంలో మృత్యు
ఒడిని చేరి తనువును
చాలిస్తున్నారు

కన్న వారికి ఆప్తులకు
శోకాన్ని కలిగిస్తున్నారు
ఆశతో బతుకుదాం
ఆపన్నులను ఆదుకుందాం
ఒత్తిడిని ఓడిధ్ధాం
ఓర్పును గెలిపిద్దాం
సహనమే ఆయుధంగా
మార్పును  కోరుదాం
మనసువిప్పి మాట్లాడుదాం
డిప్రెషన్ ఉన్న వారి పట్ల
సానుభూతిని భద్రతను
చూపుదాం వారికి చేయూత
నిద్ధాం బరోసానిద్ధాం
బాసటగా నిలుద్దాం
యువతలో ఉషారుతనం
సంతోషకర వాతావరణం
నెలకొల్పుదాం నైపుణ్యాలతో
ఆత్మనిర్బరతను పెంచుదాం
యువత ప్రతిభను సమాజ
ప్రగతి కొరకు వాడుదాం
మనసు విప్పి మనో భావాలను
పంచుకునే వాతావరణాన్ని
సృష్టించాలి ఉమ్మడి కుటుంబ
వ్యవస్థ పునర్జీవనానికి
అనువైన సామాజిక స్థితికి
పునాదులు వేద్దాం
ప్రేమ ఆప్యాయత అనురాగం
అభిమానాలు ఆత్మీయత ఆర్థత
సహనంసహకారం సంఘీభావం
సమన్వయత బంధాలు 
అనుబంధాలను
పరివ్యాప్తి చేయాలి
పటిష్ట వంతమైన
పునాదులెయ్యాలి
విద్యలో మానవీయ
విలువలను పాఠ్యాంశంగా
చేర్చాలి  సామాజిక శాస్త్రాలు
చరిత్ర అధ్యయనాన్ని
ప్రోత్సహించాలి సామాజిక
స్పృహను పెంచాలి
ఒంటరి జీవితం వద్దు
సోషల్ లైఫ్ ముద్దుఅనే
వాతావరణాన్ని సృష్టించాలి
విద్యార్థుల్లో ర్యాంకులు వద్దు
సంస్కారం సహనం సంయమనం
సంఘీభావం సౌహార్ధతే
సహకారమే హద్దు కావాలి
మనోసంకల్పమే ఆయుథమైతె
ప్రగతి పురోగతి వికసించి
నూతన క్రాంతి తేజస్సుతో
నవ సమాజం అవతరిస్తుంది
మూర్ఖత్వాన్ని వదులుదాం
మానవత్వాన్ని చాటుదాం
మమత సమత స్థాపనలో
మార్గదర్శిగా నిలుద్దాం
సమస్యలను ఓడిద్దాం
ఓపికతో ఒత్తిడిని జయిద్దాం
( ప్రపంచ ఆత్మహత్యల
నివారణా వారోత్సవాల
సందర్భంగా)
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎడ్యుకేషన్ ఫోరం
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
మాజీ కరెస్పాండెంట్ జస్టిస్
కుమారయ్య లా కాలేజ్
కరీంనగర్
రచయిత కాలమిస్ట్
కరీంనగర్9440245771
🏠 Home