మోదీతో ఫొటో కోసం ప్రతినిధుల సందడి..
భారత్ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫొటో దిగేందుకు పలువురు ప్రతినిధులు ఆయన చుట్టూ చేరారు. అదే సమయంలో అక్కడ ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ వారికి చోటిచ్చేందుకు పక్కకు తప్పుకున్నారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.న్యూఢిల్లీలో శుక్రవారం బ్రిక్స్ బిజినెస్ ఫోరంలో ఈ ఘటన జరిగింది. కార్యక్రమం సందర్భంగా మోదీ వద్దకు వచ్చిన కొందరు ప్రతినిధులు ఆయనతో ఫొటో దిగేందుకు ఆసక్తి చూపించారు. ఓ ప్రతినిధి 'మీతో ఒక ఫొటో దిగొచ్చా' అని అడగ్గా.. మోదీ వెంటనే అంగీకరించారు. దీంతో మరికొందరు ప్రతినిధులు కూడా ఆయన చుట్టూ చేరారు.