🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 11 Sep, 2026 | Page: 1

టీమిండియాతో మ్యాచ్‌పై జపాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

మరికొన్ని రోజుల్లో జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ 22వ తేదీ జపాన్ క్రికెట్ అభిమానులకు మర్చిపోలేనే రోజుగా ఉండబోతుంది. కారణం.. భారత్ జట్టుతో జపాన్ తొలిసారి టీ20 మ్యాచ్ ఆడనుంది. జపాన్‌లో క్రికెట్‌ విస్తరణతో పాటు.. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవాలకు గుర్తుగా ఈ మ్యాచ్‌ నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇప్పటికే టికెట్లన్నీ సేల్ అయిపోయినట్లు జపాన్ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జపాన్ కెప్టెన్ కెండెల్ కడోవాకి ఫ్లెమింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్ లో తమ సత్తా చూపిస్తామని తెలిపాడు. 'భారత్ తో జరిగే మ్యాచ్ కోసం మేం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఈ మ్యాచ్ జపాన్ లో పెద్ద ఎత్తున క్రికెట్ అభివృద్ధి చెందేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. రెండేళ్ల క్రితం వరకు అఫ్గానిస్థాన్, నేపాల్‌ వంటి జట్లతో మ్యాచులను నిర్వహించడమూ కష్టమని భావించేవాళ్లం. కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారాయి' అని ఫ్లెమింగ్ వెల్లడించాడు.
🏠 Home