🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 09 Sep, 2026 | Page: 1

బంగ్లాదేశ్ సైనిక విన్యాసాల్లో పేలిన చైనా తయారీ ట్యాంక్‌..

బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసాల సందర్భంగా ఆ దేశ ఆర్మీ వినియోగిస్తున్న చైనా తయారీ ట్యాంక్‌ పేలింది. ఈ సంఘటనలో ఇద్దరు బంగ్లాదేశ్‌ సైనికులు మరణించారు. మరో సీనియర్‌ ఆర్మీ అధికారి గాయపడ్డారు. ఆయనను మిలిటరీ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం చట్టోగ్రామ్‌లోని హథజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో బంగ్లాదేశ్‌ ఆర్మీ సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఈ సందర్భంగా చైనాకు చెందిన టైప్ 59 ట్యాంక్ నుంచి ఫైరింగ్‌ చేశారు. అయితే ఈ సంఘటనలో ఆ యుద్ధ ట్యాంక్‌ పేలిపోయింది. అందులో ఉన్న ఇద్దరు బంగ్లాదేశ్‌ సైనికులు మరణించారు. మరో ఆర్మీ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఆ అధికారిని మెరుగైన చికిత్స కోసం ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్‌కు హెలికాప్టర్‌లో తరలించారు.
🏠 Home