🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 07 Sep, 2026 | Page: 1

సాత్విక్‌-చిరాగ్ జోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

చైనా మాస్టర్స్ ఛాంపియన్లుగా నిలిచిన సాత్విక్-చిరాగ్ జోడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించారు. సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. చైనా మాస్టర్స్ 2026లో భారత్‌కు చారిత్రక విజయమని సీఎం అభివర్ణించారు. ఛాంపియన్లుగా నిలిచిన సాత్విక్‌సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీకి అభినందనలు తెలియజేశారు. షెన్‌జెన్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత జోడీ గెలిచిందని.. చైనా మాస్టర్స్ టైటిల్ గెలిచిన తొలి భారత జోడీగా చరిత్రలో నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమైన సాత్విక్‌సాయిరాజ్, కిడాంబి శ్రీకాంత్‌కు చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ప్రపంచ వేదికపై మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. సాత్విక్-చిరాగ్ విజయంతో భారత బ్యాడ్మింటన్‌ కొత్త శిఖరాలను చేరుకుంటుందని ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
🏠 Home