పత్రిక ప్రకటన జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిది.
స్థానిక మధుర నగర్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు అధ్యాపకులకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కల్వకుంట్ల రామకృష్ణ మాట్లాడుతూ "సమాజంలో గురువు పాత్ర ఎప్పటికీ మరవలేనిదని, ఎంత technology పెరిగిన గురువు Replace చేయడం ఎప్పటికీ సాధ్యం కాదని. సమయం సందర్భాన్ని బట్టి విద్యార్థి మానసిక స్థితిగతులను గమనిస్తూ వారికి అవసరమైన జ్ఞానాన్ని అందించడం గురువులకే సాధ్యమని. వారి నిరాశ, నిస్పృహలను గమనించి అప్పటికప్పుడు ధైర్యాన్ని , స్థైర్యాన్ని , అందిస్తూ ఉన్నత తీరాలకు చెర్చేది గురువుల మాత్రమేని ఈ సందర్భంగా పేర్కొన్నారు". ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న SRR తెలుగు విభాగాధిపతి డా. బూర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రాచీన కాలంలో విద్యావిధానం చాలా అద్బుతమని ప్రస్తుత కాలంలో కేవలం ఉపాధ్యాయులనే బాధ్యత చేయడం సరికాదని, విద్యార్థి తల్లిదండ్రులు, సమాజ బాధ్యత కూడా పిల్లలను తీర్చిదిద్దడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. జూనియర్ కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ ఇందూర మాట్లాడుతూ పిల్లలు భవిష్యత్తు మీద దృష్టి పెట్టి మంచి స్థానాలకు ఎదిగి అధ్యాపకులక మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాములు, డాక్టర్ సందెవేని తిరుపతి, నాగజ్యోతి, మాధవి, సత్య ప్రకాష్, శారద మరియు విద్యార్థులు సాయికృష్ణ, మధుకర్, భరద్వాజ్ విద్యార్థులు పాల్గొన్నారు.