🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 05 Sep, 2026 | Page: 1

విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం: శిక్షకులకు సన్మానం

దేవరకొండ 05 సెప్టెంబర్ (BVK 3 న్యూస్ ) :
దేవరకొండ పట్టణంలోని విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ బాషా చౌహాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సొసైటీలో సేవలందిస్తున్న మహిళా శిక్షకులను ఘనంగా సత్కరించారు.
​ఈ సందర్భంగా టైలరింగ్ టీచర్ ఎన్. శాంతి, కంప్యూటర్ టీచర్ బి. నిహారిక, బ్యూటీషియన్ టీచర్ కె. కవితలను శాలువాలతో ఘనంగా సన్మానించి, వారి సేవలను కొనియాడారు. అనంతరం డాక్టర్ బాషా చౌహాన్ మాట్లాడుతూ... మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంలో మరియు వారిని ఆర్థికంగా నిలబెట్టడంలో ఉపాధ్యాయులు, శిక్షకుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. నిస్వార్థంగా శిక్షణ అందిస్తూ మహిళల ఉన్నతికి తోడ్పడుతున్న శిక్షకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
​ఈ కార్యక్రమంలో సొసైటీ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో శిక్షణ పొందుతున్న మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home