ఒంటరిగా నదిని శుభ్రం చేసిన 21 ఏళ్ల యువకుడు..
మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువకుడు బిట్టు తబాహి తన సొంత చేతులతో ఒక నదిని శుభ్రం చేసి సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నదినే కాకుండా తన చుట్టు ప్రక్కాల ఉన్న మురికి కాలువలను కూడా అతడు శుభ్రం చేసి వైరల్‌గా మారాడు. అయితే బిట్టు పనితనాన్ని మెచ్చిన నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’వ్యవస్థాపకుడు, సీఈఓ బోయాన్ స్లాట్ స్పందిస్తూ.. బిట్టుకు తన సంస్థలో ఉద్యోగం ఆఫర్ చేయడమే కాకుండా నెదర్లాండ్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు.మధ్యప్రదేశ్‌లోని ‘అజ్నార్’ నది ప్లాస్టిక్ వ్యర్థాలతో, మురికితో పూర్తిగా నిండిపోతే స్థానిక యంత్రాంగాలు పట్టించుకోలేదు. దీంతో 20 ఏళ్ల బిట్టు ఎలాంటి యంత్రాలు లేకుండా, తానొక్కడే సాహసించి దాదాపు 3 నెలల పాటు కష్టపడి ఆ నదిలోని చెత్తను పూర్తిగా తొలగించాడు. అయితే తాను చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలాడు. అయితే అతను పడిన కష్టానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం అతని నిబద్ధతను అభినందించారు. అతడి వీడియోలు వరల్డ్ వైడ్‌గా వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు, నదులలోని ప్లాస్టిక్‌ను తొలగించే ప్రముఖ సంస్థ ‘ది ఓషన్ క్లీనప్’ ఫౌండర్ బోయాన్ స్లాట్ బిట్టు చేసిన సాహసాన్ని గుర్తించారు. అతనికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ నెదర్లాండ్స్‌కు రావాల్సిందిగా సోషల్ మీడియా వేదికగా ఆహ్వానం పంపారు.