నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17
భూ పరిశీలన ఉపగ్రహం ఈఓఎస్-05ను నింగిలోకి పంపేందుకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. శుక్రవారం తెల్లవారుజామున 2.55 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ మిషన్‌లో భాగంగా 2,367 కిలోల బరువున్న ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని ఉప-భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. భూ పరిశీలన సామర్థ్యాలను మరింత విస్తరించే ఈ ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి పెట్టారు.
విపత్తుల పర్యవేక్షణకు కీలకం..
ఈఓఎస్-05 ఉపగ్రహం ద్వారా పెద్ద భూభాగాలకు సంబంధించిన చిత్రాలను తరచుగా సేకరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పరిస్థితులను వేగంగా అంచనా వేయడానికి ఇది ఉపయోగపడనుంది. తుపాన్లు, మేఘ విస్ఫోటాలు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు వంటి పరిణామాలను పర్యవేక్షించడంలో ఉపగ్రహం కీలక సమాచారం అందించనుంది. వ్యవసాయం, అటవీ ప్రాంతాలు, నీటి వనరులపై కూడా ఉపగ్రహం నుంచి సేకరించే సమాచారాన్ని ఉపయోగించుకోవచ్చు. భూమికి సంబంధించిన మార్పులను ఎప్పటికప్పుడు గమనించేందుకు ఇది మరో కీలక సాధనంగా మారనుంది.
జీఎస్‌ఎల్వీ శ్రేణిలో 19వ ప్రయోగం..
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 ప్రయోగం ఈ శ్రేణిలో 19వ మిషన్‌గా నిలవనుంది. సుమారు 51.7 మీటర్ల ఎత్తు ఉన్న ఈ రాకెట్ ప్రయోగ సమయంలో 420.5 టన్నుల బరువుతో ఉంటుంది. మూడు దశలుగా పనిచేసే జీఎస్‌ఎల్‌వీలో క్రయోజెనిక్ పైదశ కీలక భాగంగా ఉంటుంది. సాధారణంగా భారీ ఉపగ్రహాలను భూస్థిర బదిలీ కక్ష్యల్లోకి చేర్చేందుకు ఈ రాకెట్‌ను వినియోగిస్తారు. అయితే ఈసారి ఈఓఎస్-05ను ఉప-భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇలాంటి కక్ష్యలోకి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని పంపడం ఈ మిషన్ ప్రత్యేకతగా ఇస్రో పేర్కొంది.
2021 వైఫల్యానికి కొనసాగింపుగా..
ఈ ప్రయోగానికి గతంలో జరిగిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 మిషన్‌తోనూ సంబంధం ఉంది. 2021 ఆగస్టు 12న ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించగా, క్రయోజెనిక్ పైదశలో ఏర్పడిన ఇగ్నిషన్ సమస్య కారణంగా మిషన్ విజయవంతం కాలేదు. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. తాజా మిషన్‌ను మరింత జాగ్రత్తగా సిద్ధం చేసింది. ప్రస్తుతం జీఎస్‌ఎల్‌వీ వ్యవస్థలన్నింటినీ పరిశీలించి ప్రయోగానికి సిద్ధంగా ఉంచారు. కౌంట్‌డౌన్ సజావుగా కొనసాగుతుండటంతో శుక్రవారం తెల్లవారుజామున ప్రయోగం కోసం ఆసక్తి నెలకొంది.