🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 02 Sep, 2026 | Page: 1

కాలికి గాయంతో ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లిన వ్యక్తి.. వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు.

జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దెందులూరులో ఆర్‌ఎంపీ వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వేముల తిరుపతయ్య అనే వ్యక్తి కాలికి గాయమైంది. చికిత్స నిమిత్తం ఆర్‌ఎంపీ వైద్యుడు అరిసెల అప్పలస్వామి వద్దకు వెళ్లాడు. తిరుపతయ్య గాయాన్ని చూసిన ఆర్‌ఎంపీ వైద్యుడు... ఆయనకు ఇంజెక్షన్ వేశాడు. ఇంటికి వెళ్లిన వెంటనే తిరుపతయ్య అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు.. అతడి హుటాహుటిన ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే తిరుపతయ్య మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆర్ఎంపీ వైద్యుని నిర్లక్ష్యం వల్లే మృతిచెందాడంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంపీ డాక్టర్ అప్పలస్వామి ఇంటి ఎదుట బైఠాయించి ధర్నాకు దిగారు. తిరుపతయ్య మృతి విషయం తెలిసిన వెంటనే అప్పలస్వామి.. ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
🏠 Home