4న జీఎస్ఎల్వీ-ఎఫ్17 రాకెట్ ప్రయోగం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మెన్
సెప్టెంబర్ 4వ తేదీన జీఎస్ఎల్వీ-ఎఫ్17రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జీఎస్ఎల్వీ కేటగిరీలో ఇది 19వ రాకెట్ కావడం విశేషం. ఈ రాకెట్ ద్వారా నింగిలోకి ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని తీసుకెళ్లనున్నారు. జియో ప్లాట్‌ఫామ్‌పై ప్రయోగిస్తున్న తొలి భారతీయ ఉపగ్రహం ఈఓఎస్-05 అని నారాయణన్ తెలిపారు.సబ్-జీటీవో కక్ష్యలోకి ఈఓఎస్-05 శాటిలైట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సతీశ్ ధావన్ స్పెస్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్17ను ప్రయోగించనున్నారు. దీని పేలోడ్ ఫేరింగ్ 4 మీ డయామీటర్లు ఓగీవ్గా పేర్కొన్నారు. ఈఓఎస్-05 అనేది ఎర్త్ అబ్జర్వేషన్ స్పేస్‌క్రాఫ్ట్. దీని ద్వారా భూమిను పరిశీలించనున్నారు. జియోసింక్రోనస్ ఆర్బిట్ నుంచి ఈ శాటిలైట్ ఇమేజ్‌లను తీస్తుంటుంది.