🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 31 Aug, 2026 | Page: 1

మన విలువకు మనమే కర్త కర్మ క్రియ

ఎవడో విలువ ఇవ్వలేదని
బాధపడద్దు మనకు విలువ
ఇవ్వమని అడిగే ముందు
మనమే విలువ పెంచుకోవాలి
మన విలువలకు మనమే
కర్త కర్మ క్రియ మనం విలువలు
పాటిస్తే అదే విలువలు మనకు
గుర్తింపు తెస్తాయి
మన నైపుణ్యాలు మన వ్యక్తిత్వం
మన ఆలోచన విధానం మన
నడవడి మన చర్యల కలబోతే
మన విలువ
ఇతరుల పట్ల గౌరవం ఆదరణ
మన ఉనికిని చాటుతాయి
మన ముందు మంచి అని
పొగిడే వారు మన వెనుక
కూడా మన పట్ల మంచినే
చెప్పాలి మంచిని పెంచి
మంచిని పంచే మానవతా
వాదులుగా నిలువాలి
సక్రమ జీవనశైలిపరోపకారం
సహనశీలత ఆలోచనలకు
ఆచరణకు మధ్య సమతూక
మనస్తత్వంవిశ్వసనీయతకు
ఆలంభణ అవుతుంది
సకారత్మక కార్యాచరణతో
జీవిస్తే సమాజంలో
మీవ్యక్తిత్వానికి విలువ
ఉంటుందిసమాజంలో
గౌరవం లభిస్తుంది
కష్టాలను ఇష్టాలుగా మార్చుకొని
ముందడుగు వేస్తే సమాజానికి
స్ఫూర్తి వైతావు పట్టుదలే
పెట్టుబడిగా సంకల్పిస్తే
ప్రగతి వెలుగులకుదీప్తి వైతావు
నేదునూరి కనకయ్య
ఫ్రీలాన్స్ రచయిత
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
రాష్ర్ట అధ్యక్షులు
కరీంనగర్9440245771
🏠 Home