🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 31 Aug, 2026 | Page: 1

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్‌-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈరోజు(సోమవారం) ఉదయం దోర్నాల మండలం గంటావానిపల్లి వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ వద్ద కృష్ణమ్మకి జలహారతి ఇచ్చి, సారె సమర్పించారు. కృష్ణా జలాలను తలపై చల్లుకున్నారు. పంచె కట్టుతో సాంప్రదాయంగా పూజా కార్యక్రమం ముఖ్యమంత్రి పాల్గన్నారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పైలాన్‌ను ఆవిష్కరించిన సీఎం.. జాతికి అంకితం చేశారు. ఆపై నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేశారు.దీంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపలో కరవు ప్రాంతాలకు జలకళ సంతరించుకుంది. 1996 మార్చి 5 న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు.. 30 ఏళ్ల తరువాత దానిని పూర్తి చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
🏠 Home