🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 31 Aug, 2026 | Page: 1

ప్రేమ విఫలమై.. ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ నిభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. లవ్‌ఫెయిల్యూర్‌నే బలవన్మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న నిభాష్ (25) పెట్లబుర్జులో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమె కుటుంబసభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో నిభాష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే రాత్రి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు ఈ విషయాన్ని వాట్సాప్‌లో తన స్నేహితులకు సమాచారం అందించాడు. అయితే ఉదయం స్నేహితులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా.. నిభాష్ విగతజీవిగా కనిపించాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home