అమెరికాలో హైదరాబాదీ యువతి హత్య..
అమెరికాలో సంచలనం సృష్టించిన హైదరాబాదీ యువతి నిఖిత గోదిశాల (27) హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మ (26)ను హైదరాబాద్ పోలీసులు ఆగ్రాలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. ఈ హత్య కేసులో భాగంగా ఇప్పటికే నిందితుడిపై అమెరికా పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో అతడు అమెరికా నుంచి భారత్‌కు పారిపోయి వచ్చాడు. ప్రస్తుతం అమెరికా అధికారులకు అర్జున్ శర్మను అప్పగించే ప్రక్రియ కొనసాగుతోంది.హైదరాబాద్‌కు చెందిన నిఖిత గోదిశాల అమెరికాలోని మేరీల్యాండ్‌లోని ఎల్లికాట్ సిటీలో ఉద్యోగం చేస్తోంది. డిసెంబర్ 31, 2025న ఆమె హత్యకు గురైనట్లు కుటుంబ సభ్యులకు భారత అధికారులు సమాచారం అందించారు. నిఖిత కనిపించడం లేదంటూ జనవరి 2న ఫిర్యాదు అందడంతో హోవర్డ్ కౌంటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేరీల్యాండ్‌లోని అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌లో నిఖిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో శర్మపై ఫస్ట్-డిగ్రీ, సెకండ్-డిగ్రీ హత్య ఆరోపణలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. అయితే, నిందితుడు భారత్‌కు పారిపోయి వచ్చాడు