🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 28 Aug, 2026 | Page: 1

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ

ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతలను స్వీకరించారు. ఈరోజు(శుక్రవారం) మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజతో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు చేపట్టారు. నాగబాబుకి వేదపండితులు వేదఆశీర్వచనం అందించారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో అటవీ, వృక్ష విస్తీర్ణాన్ని 50 శాతానికి పెంచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు కీలక బాధ్యతలను అప్పగించారు.
ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా ఆయనకు ప్రభుత్వం కేబినెట్ ర్యాంకు హోదాను కల్పించింది. ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన నాగబాబుని పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, అడిషనల్ పీసీసీఎఫ్ చీఫ్ రాహుల్ పాండే, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎన్.నాగేశ్వరరావు, సీసీఎఫ్ గుంటూరు వై.శ్రీనివాసరెడ్డి, పీసీసీఎఫ్ విజిలెన్స్ శరేవతి, సీసీఎఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీ గ్రీన్ బి.ఎన్.ఎన్.మూర్తి, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ వెంకటకృష్ణ, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్, తూర్పుకాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా పాలవలస యశస్వి, పొల్యూషన్ కంట్రోట్ బోర్డు మెంబర్ పంచకర్ల సందీప్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home