🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 27 Aug, 2026 | Page: 1

సామాజిక పరిశోధకులు . రచయిత. ఆర్థిక వేత్త ప్రముఖ కాలమిస్ట్ నేదునూరి కనకయ్య గారికి అభినందనలు ‌‌. ‌

ప్రముఖ ఆర్థికవేత్త సామాజిక ఆర్థిక విశ్లేషణ నిపుణులు చైతన్య వంతమైన రచయిత ప్రముఖ కాలమిస్ట్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య గత నాలుగు దశాబ్దాలుగా రాష్ట్రములో అర్తశా స్త్ర పరిజ్ఞాన పరివ్యాప్తి కి మరియు మానవతావాదం సామాజిక విలువలు బీసీ మహిళా యువత సాధికారిత రాజ్యాధికారములో బీసీ వాటా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్స్ కుటుంబ వ్యవస్థ బంధాలు అనుబంధాలు ఆత్మవిశ్వాసం బాల కార్మిక వ్యవస్థ స్త్రీ పురుష సమానత్వం సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలపై రాసిన పరిశోధనాత్మక వ్యాసాలను కవితలను గుర్తిస్తూ వారుచేసిన సాహితీ సేవలు గుర్తిస్తూ
ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఎక్స్లెలెన్సీ అవార్డ్ బహుకరించి నేదునూరి కనకయ్యను అభినందించడం పట్ల సామాజిక రచయితల సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్. ఈదునూరి. వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. నేదునూరికనకయ్య ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను శాస్త్రీయ విశ్లేషణ చేయడంలో విషయ ప్రవీణులని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అసంఘటిత రంగంలో బాల కార్మికుల సామాజిక ఆర్థిక స్థితి గతుల పై కనకయ్య రాసిన పరిశోధక పత్రం అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రచురించిన ఇంటర్నేషనల్ లేబర్ ఎట్ వర్క్ అనే అంతర్జాతీయ సెమినార్ పత్రికలో ప్రచురింప బడడం వారి పరిశోధ నాత్మక శక్తికి నిదర్శనమని వారి ఉత్తమ బోధనా సేవలతో ఎంతో మంది యువ ఆర్థిక వేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు .వారి శిష్యులు ఉత్తమ అధ్యాపకులుగా ప్రభుత్వ రంగంలో ఐ ఎ ఎస్ ఉన్నత స్థాయి ఉద్యోగులుగా రాజకీయ పార్టీలలో ఉత్తమ నాయకులుగా ఎమ్మెల్లే 'ఎం' పి లు గా స్థానిక సంస్థల్లో ప్రజా ప్రతినిధులుగా సేవలు అందించడం విశేషమని అర్థ శాస్త్ర ఆణిముత్యం నేదునూరి కనకయ్య‌ అని డాక్టర్ ఈదునూరి వెంకటేశ్వర్లు కొనియాడారు.ఆదాబ్ హైదరాబాద్ పత్రికసంస్థ అధ్వర్యంలో రవీంద్ర భారతీ హైదరాబాద్ లో ఆగస్టు 26 వ తేదీనాడు ఆదాబ్ హైదరాబాద్ పత్రిక 15 వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో ఎడిటోరియల్ పేజీకి ఆర్టికల్స్ కవితలు రాసిన రచయితలకు కవులకు ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఛైర్మెన్ ఎడిటర్ ఇన్ చీఫ్ వీరమల్ల సత్యం పురస్కారాను ప్రధానం చేశారు. అవార్డ్స్ బహూకరణ ఉత్సవములో విశిష్ట అతిథిగా ముఖ్య అతిథులు రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంపీలు ఎమ్మెల్యేలు నటులు పాత్రికేయులు అతిధులుగా పాల్గొన్నారు.
ఆదాబ్ హైదరాబాద్ సంస్థ
ద్వారా సన్మానాన్ని అందుకున్న తెలంగాణ ఎకనామిక్ ఫోరం & సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక సంస్థ తెలంగాణ ఎడుకేషన్ ఫోరం' తెలంగాణ వికాస వేదిక రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య గారికి సామాజిక రచయితల వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఈదునూరి వెంకటేశ్వర్లు ఒక పత్రిక ప్రకటనలో‌ అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ యూనివర్సిటీ ఆర్త శాస్త్ర ప్రొఫెసర్ డాక్టర్ సి హెచ్ శ్రీనివాస్ ప్రసంగిస్తూ కనుకయ్య గారు గత40 సంవత్సరాల నుండి భొదనా‌వృత్తిలో రాణిస్తూ అర్థశాస్త్ర అధ్యాపకులుగా సామాజిక అంశాల మీద కవితలు ఆర్టికల్స్ రాస్తూవిశేష సేవలు చేసిన ఆదర్శ అధ్యాపకులు 'అర్థశాస్త్ర గ్రంధ రచయిత ' ప్రవృత్తి రచన' పరిశోధన విశ్లేషణాత్మక సామర్థ్యం కలిగిన ఆర్థికవేత్త అని పరిశోధనాత్మక రచనా రంగంలో వివిధ సామాజిక ఆర్థిక 'రాజకీయ 'సాంస్కృతిక అంశాల మీద
కనకయ్య గారు రాసిన విశ్లేషణాత్మక ఆర్టికల్స్ ప్రముఖ జర్నల్స్' పత్రికలో పబ్లిష్ చేసి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయోగపడేట్లుండడం గర్వకారణమని ఆర్థిక వ్యవస్థ అర్థశాస్త్రం కాన్సెప్ట్స్ మీధ విద్యార్థులకు క్విజ్ అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన విషయ నిపుణులు వీరి రాసిన పలు ఆర్టికల్స్ ప్రాంతీయ జాతీయ స్థాయిలో వివిధ పత్రికలలో పరిశోధనా జర్నల్స్ ల్లో పబ్లిష్ అయినాయి వారి పరిశీలన పరిశోధన దృక్పధానికి నిదర్శనమని కొనియాడారు.
ఆదాబ్ హైదరాబాద్ పత్రిక సంస్థ నేదునూరి కనకయ్య ను అభినందించడం పట్ల పలువురు రచయితలు మేధావులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వివేక రచయితల సంఘం అధ్యక్షుడు బాల సాహితీ వేత్త డాక్టర్ వారసవేని పరశురామ్ 'రిటైర్డ్ ప్రిన్సిపాల్ జీ అశోక్ 'డాక్టర్ దశరతం 'డాక్టర్ జీ నాగభూషణం డాక్టర్ కె మురళి రిటైర్డ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ 'తిమ్మారెడ్డి బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు కొల్లూరి అనిల్ కుమార్ 'తెలంగాణ కుమ్మర సంఘం 880/2014 రాష్ట్ర సలహాదారులు మలికంటి వెంకన్న టి యాదగిరి ఎన్ ప్రభాకర్ ఎన్ శంకర్ బుచ్చయ్య మహేందర్' రాజు విజయ్ బోజి రెడ్డి సుధాకర్ గుప్త ఎన్ ప్రభాకర్ 'బాలకృష్ణ రిటైర్డ్ ప్రిన్సిపాల్ 'రామచందర్ మనోహర్ రావు' టి 'వి 'స్వామి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
నేదునూరి కనకయ్య అభినందన పట్లసామాజిక రచయితల సంఘం వరంగల్ జిల్లా కమిటీ పక్షాన హృదయపూర్వక అభినందనలు జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఈదునూరివెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ఇట్లు
డాక్టర్. ఈదునూరి.
వెంకటేశ్వర్లు.
జిల్లా అధ్యక్షులు.
సామాజిక రచయితల సంఘం. వరంగల్ జిల్లా కమిటీ.
9966336457
ఫోటో రైట్ అప్
(ఆగస్టు 26 వ తేదీ హైదరాబాద్ రవీంద్ర భారతీ లో ఆదాబ్ హైదరాబాద్ 15 వార్షికోత్సవంలో ఎక్స్ లెన్స్ పురస్కారాల ప్రదానోత్సవంలో సన్మానాన్ని స్వీకరిస్తున్న ఆర్థిక వేత్త రచయిత ' ప్రముఖ కాలమిస్ట్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య
(లెఫ్ట్ నుండి 3 వ వ్యక్తి)
ఆదాబ్ హైదరాబాద్ పత్రిక ఛైర్మెన్ ఇరుమళ్ల సత్యం తదితరులు)
🏠 Home