🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 27 Aug, 2026 | Page: 1

ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే రోజు 10 మంది నవజాత శిశువులు మృతి

ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో ఒకే రోజు పది మంది నవజాత శిశువులు మరణించారు. దీంతో కలకలం చెలరేగింది. అయితే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆ నవజాత శిశువులను పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి రిఫర్‌ చేసినట్లు వైద్యాధికారి తెలిపారు. (newborns die) పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మాల్దా మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ఒకే రోజు పది మంది నవజాత శిశువులు చనిపోయారు. ఆగస్ట్‌ రెండో వారంలో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ సమగ్ర నివేదిక కోరింది.
కాగా, మరణించిన 10 మంది శిశువులలో ఎనిమిది మంది ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు లేదా ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లలో జన్మించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ ప్రసేన్‌జిత్ బార్ తెలిపారు. తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్న ఆ నవజాత శిశువులను మాల్దా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు చెప్పారు.
శ్వాసకోశ ఇబ్బందులు, పచ్చకామెర్లు, గుండె సంబంధిత సమస్యల కారణాలతో ఆ శిశువులు మరణించినట్లు వివరించారు.
🏠 Home