🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 27 Aug, 2026 | Page: 1

పేలుతున్న ఉల్లిగడ్డ ధరలు..

తల్లి చేసే మేలు ఉల్లి చేస్తుందంటారు. రుచితో పాటు ఔషధగుణాలు కలిగిన ఉల్లిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం తెల్ల ఉల్లి కిలోకు రూ.100 చేరువ కాగా, ఎర్ర ఉల్లి రూ.60 నుంచి 70 వరకు ధర పలుకుతోంది. రెండు నెలల కిందట వాహనాల ద్వారా ఎర్ర ఉల్లిని రూ.100కు ఆరు కిలోల చొప్పున అందించేవారు. కిలోకు రూ.20 ఉన్న ఎర్ర ఉల్లి అమాంతం పెరిగి వినియోగదారుడిని బెంబేలెత్తిస్తోంది. ధరలు బాంబుల్లా పేలుతుండటంతో తెల్ల ఉల్లి ఆకాశాన్ని అంటుతోంది.మాంసాహారం, శాకాహారం, చపాతీలు, మిర్చి బజ్జీలు, చిట్టి గ్యారెలు తదితర పదార్థాల్లో కమ్మగా నంజుకుతినే ఉల్లి... ధరాభారంతో ఆందోళన కలిగిస్తోంది. పెరిగిన ధరలు చూసి గృహిణులు సైతం దడుసుకుంటున్నారు. సామాన్య ప్రజలు ఉల్లిని కొనాలంటే ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఉల్లిని మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటారు. కానీ అక్కడ వర్షాలు లేక పంటలు పండకపోవడంతో దిగుమతి తగ్గింది.. దీంతో ధర పెరిగింది.
🏠 Home