🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 27 Aug, 2026 | Page: 1

అత్య‌ధిక ప‌రుగుల‌తో బ‌ట్లర్‌కు షాకిచ్చిన హిట్ట‌ర్..!

ఒక‌ప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్‌లో.. ఆపై ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఉతికేస్తున్న కీర‌న్ పొలార్డ్ మ‌ళ్లీ అగ్ర‌స్థానం ద‌క్కించుకున్నాడు. విధ్వంస‌క ఆటగాడైన పొలార్డ్ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగుల వీరుడిగా నిలిచాడు. క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో 26 బంతుల్లోనే 65 ర‌న్స్ చేసిన ఈ భారీకాయుడు.. ఇటీవ‌ల త‌న‌ను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్ల‌ర్ నుంచి అగ్ర‌స్థానాన్ని లాగేసుకుడు.పొట్టి క్రికెట్‌లో ఇంగ్లండ్ విధ్వంస‌క ఓపెన‌ర్‌ జోస్ బ‌ట్ల‌ర్ అత్య‌ధిక ప‌రుగుల రికార్డు బ‌ద్ధ‌లైంది. ది హండ్రెడ్ లీగ్‌లో మెరుపు అర్ధ శ‌త‌కంతో.. కీర‌న్ పొలార్డ్‌ను దాటేసిన అత‌డు ఇప్పుడు మ‌ళ్లీ రెండో స్థానానికి ప‌డిపోయాడు. క‌రీబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో దంచేసిన పొలార్డ్.. 14,921 ప‌రుగుల‌తో అగ్ర‌స్థానం ద‌క్కించుకున్నాడు. స్వ‌దేశంలో జ‌రుగుతున్న ఈ మెగా టోర్నీలో బుధ‌వారం.. ట్రిన్‌బ‌గో నైట్ రైడ‌ర్స్ త‌ర‌ఫున 26 బంతుల్లోనే 65 ర‌న్స్ కొట్టిన పొలార్డ్.. మ‌ళ్లీ టాప్‌లోకి వ‌చ్చాడు.
🏠 Home