బంధాలకు అనుబంధాలకు వారధి రక్షాబంధన్
ఆత్మీయత అనురాగాలకు
ఆర్ద్రత అవగాహనకు
బంధాలకు అనుబంధాలకు
"రక్ష" కావాలి "రక్షాబంధన్"
సోదర భావానికి ఆత్మీయత
అనే గంధం అద్దితే కనిపించే
సుందర రూపమే రక్షాబంధన్
యుగ యుగాలుగా తర తరాలుగా
రాఖీ పౌర్ణమి హిందూ సంస్కృతి
ధర్మ రక్షణకు ప్రతిబింబంగా
నిలిచింది
అన్నదమ్ములకు అక్క చెల్లెలు కట్టే
అపురూప ఆత్మీయ బంధాల
రక్షణ కవచం "రాఖీ"
రాఖీ పండుగ ఆనందాల వెల్లువ
అనుబంధాల సందడి అనురాగాల
సంఘమం మమతల అనుబంధం
పరిమళించే రక్షాబంధన్
ప్రేమను పంచి ఆదరాభిమానాలు
చూపే ఆత్మీయ బంధం రక్షాబంధన్
సోదరుడి ఉన్నతికి వాత్సల్య
బంధం రక్షాబంధన్ సోదరి రక్షణ
సూచించే ప్రమాణం కష్ట నష్టాల్లో
కలిమి లేముల్లో కలిసి ఉండేలా
చేసే మంత్రం రక్షాబంధన్
కులాలు వేరైనా మతాలు వేరైనా
ప్రాంతాలు వేరైనా ప్రేమనుపంచే
దీపమే రక్షాబంధన్
కష్ట సుఖాలందు తోడు నీడగా
నిలిచి అమ్మా నాన్నలు
మెచ్చగా పయనిద్దాం
కలిసి మెలిసి అని ప్రతిజ్ఞ
చేసే రోజు రక్షాబంధన్
అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు
జరుపుకునే మహత్తరమైన
పండుగ రక్షాబంధన్
చెల్లెలి తన అన్నయ్య
మహోన్నత శిఖరాలకు
ఎదగాలని కోరుకుంటూ
కట్టే రాఖీ వెలకట్టలేని
బంధాలను వదులుకోలేని
అనుబంధాలకు గుర్తు
రక్షాబంధన్
ఒంటరితనం వేధిస్తున్న
సమస్యలతో జీవితం సతమత
మవుతున్న సోదరీ అనే ఒక
తోడును ఇచ్చే ప్రేమ బంధమే
రక్షాబంధన్
అగ్రవాధం ఉగ్రవాదం
హింసావాదం కుటుంభవాదం
కులవాధం సంఘ విభాజక శక్తుల
నుండి దేశాన్ని రక్షిద్దాం
అవినీతి అరాచక నేర రాజకీయాల
విముక్తికి స్వచ్ఛ పాలనకు
పచ్చదనం పరిశుభ్రతకు
పర్యావరణ ప్రకృతి రక్షణకు
మమత సమత సౌబ్రాతృత్వ
సంఘీభావ మానవీయ విలువల
రక్షణతో కుటుంబ వ్యవస్థ
పునర్జీవనానికి మెరుగైన సమాజ
నిర్మాణానికి దేశ రక్షణకు
రక్షాబంధన్ వారధిగా నిలవాలి
నేదునూరి కనకయ్య
రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ఎకానమిక్ ఫోరం '
తెలంగాణ వికాస వేదిక
కరీంనగర్
9440245771
ఆర్ద్రత అవగాహనకు
బంధాలకు అనుబంధాలకు
"రక్ష" కావాలి "రక్షాబంధన్"
సోదర భావానికి ఆత్మీయత
అనే గంధం అద్దితే కనిపించే
సుందర రూపమే రక్షాబంధన్
యుగ యుగాలుగా తర తరాలుగా
రాఖీ పౌర్ణమి హిందూ సంస్కృతి
ధర్మ రక్షణకు ప్రతిబింబంగా
నిలిచింది
అన్నదమ్ములకు అక్క చెల్లెలు కట్టే
అపురూప ఆత్మీయ బంధాల
రక్షణ కవచం "రాఖీ"
రాఖీ పండుగ ఆనందాల వెల్లువ
అనుబంధాల సందడి అనురాగాల
సంఘమం మమతల అనుబంధం
పరిమళించే రక్షాబంధన్
ప్రేమను పంచి ఆదరాభిమానాలు
చూపే ఆత్మీయ బంధం రక్షాబంధన్
సోదరుడి ఉన్నతికి వాత్సల్య
బంధం రక్షాబంధన్ సోదరి రక్షణ
సూచించే ప్రమాణం కష్ట నష్టాల్లో
కలిమి లేముల్లో కలిసి ఉండేలా
చేసే మంత్రం రక్షాబంధన్
కులాలు వేరైనా మతాలు వేరైనా
ప్రాంతాలు వేరైనా ప్రేమనుపంచే
దీపమే రక్షాబంధన్
కష్ట సుఖాలందు తోడు నీడగా
నిలిచి అమ్మా నాన్నలు
మెచ్చగా పయనిద్దాం
కలిసి మెలిసి అని ప్రతిజ్ఞ
చేసే రోజు రక్షాబంధన్
అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు
జరుపుకునే మహత్తరమైన
పండుగ రక్షాబంధన్
చెల్లెలి తన అన్నయ్య
మహోన్నత శిఖరాలకు
ఎదగాలని కోరుకుంటూ
కట్టే రాఖీ వెలకట్టలేని
బంధాలను వదులుకోలేని
అనుబంధాలకు గుర్తు
రక్షాబంధన్
ఒంటరితనం వేధిస్తున్న
సమస్యలతో జీవితం సతమత
మవుతున్న సోదరీ అనే ఒక
తోడును ఇచ్చే ప్రేమ బంధమే
రక్షాబంధన్
అగ్రవాధం ఉగ్రవాదం
హింసావాదం కుటుంభవాదం
కులవాధం సంఘ విభాజక శక్తుల
నుండి దేశాన్ని రక్షిద్దాం
అవినీతి అరాచక నేర రాజకీయాల
విముక్తికి స్వచ్ఛ పాలనకు
పచ్చదనం పరిశుభ్రతకు
పర్యావరణ ప్రకృతి రక్షణకు
మమత సమత సౌబ్రాతృత్వ
సంఘీభావ మానవీయ విలువల
రక్షణతో కుటుంబ వ్యవస్థ
పునర్జీవనానికి మెరుగైన సమాజ
నిర్మాణానికి దేశ రక్షణకు
రక్షాబంధన్ వారధిగా నిలవాలి
నేదునూరి కనకయ్య
రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ఎకానమిక్ ఫోరం '
తెలంగాణ వికాస వేదిక
కరీంనగర్
9440245771