🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 26 Aug, 2026 | Page: 1

భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న వారి పట్టాలు రద్దుచేసి బాధ్యులైన రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలి

* కల్లు గీత కార్మిక సంఘంములుగు జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్.
ములుగు జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 26 (బీవీకే న్యూస్):
మల్లంపల్లి మండలం రామచంద్రాపురం శివారులోని సోమలతండ పక్కన ఉన్న సర్వే నెంబర్ 31 93 లో గల భూమి నల్లబెల్లి మండలం బొలోని పల్లి గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ తిప్పని సుధాకర్ అతను సోదరుడు తిప్పన శ్రీనివాస్ కు చెందిన పట్టా భూమిని నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన మార్త సదానందం నిరంజన్ గార్లు భూమిని ఆక్రమించుకొని వారి కూతురు కొడుకైన ఖ్యాతం ప్రవీణ్ పైన అక్రమంగా ఎనిమిది ఎకరాల పట్టా చేయించుకోవడం జరిగింది . ఈ విషయం తెలుసుకున్న కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవిగౌడ్ బాధితులను వారి గ్రామం బోలోనిపల్లి లో కలిసి వివరాలు తెలుసు కోవడం జరిగింది ఈ సందర్బంగా రవిగౌడ్ మాట్లాడు తూ భూ బాధితులు సుధాకర్. శ్రీనివాస్ లు పెద్దల సమక్షంలో సదానందం కలువగా తప్పుగా మా మనవడు పేరు మీద పట్టా కావడం జరిగింది. మీది మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. క్యాతం ప్రవీణ్ పేరు మీద ఉన్నా పట్టా పాస్ బుక్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డు కుడా మీ సేవలో స్లాబ్ బుక్ చేసుకొండి అని చెప్పడం జరిగింది.
ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులకు వారి దగ్గర పోతే మీ భూమిని నీను ఎక్కించు కోలేదు మీకు మాకు సంబంధం లేదని చెప్పడం జరిగింది . ఈ విషయమైనా సంబంధిత రెవెన్యూ అధికారుల దగ్గరికి పోయి
ఆర్టిఐ ప్రకారంగా మా భూమిఎలా పట్టాయిందో వివరాలు తెలియజేయాలని సమాచారహక్కు కింద దరఖాస్తు పెట్టుకుంటే ఆధారాలు లేవని అధికారులు చెప్పడం జరిగింది. ఆధారాలు లేకుంటే అక్రమంగ పట్టా ను అధికారులు ఎలా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ పట్టాను రద్దుచేసి నిజమైన బాధితులైన తిప్పని సుధాకర్ శ్రీనివాసులకు పట్టా చేయించాలని అధికారులను కోరుచున్నాము, లేనిచో కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాధితులతో నిరాహార దీక్ష చేస్తామని సంఘం జిల్లా అధ్యక్షులు గుండెబోయిన రవి గౌడ్ అధికారులకు తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి 2016లో అక్రమంగా పట్టా చేసిన అధికారుల పైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అలాగే అధికారులను తప్పుదోవ పట్టించి అక్రమంగా పట్టా చేయించుకున్న మార్త సదానందం మరియు నిరంజన్ క్యాతం ప్రవీణ్ ల పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాము.
🏠 Home