🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 26 Aug, 2026 | Page: 1

చింతూరులో ఓఎస్డీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు..

జిల్లాలోని చింతూరు పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. చింతూరు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఎదుట వీరు లొంగిపోయినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. వీరిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారని తెలిపాయి. వీరి పేర్లు.. ముచ్చిక లక్ష్మి, కదిటి వెంక, కదిటి లక్షయ్య అని వివరించాయి. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా పని చేస్తూ.. గతంలో పలు హింసాత్మక కర్యకలాపాలతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నాయి.వీరి మీద పలు కేసులు కూడా నమోదయి ఉన్నాయని చెప్పాయి. హింసాయుత మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు వీరు ముందుకు వచ్చారని చింతూరు ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఈ సందర్భంగా తెలిపారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస విధానాల అనుగుణంగా సహాయం అందించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
🏠 Home