🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 25 Aug, 2026 | Page: 1

చేగుర్తి గ్రామంలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

కరీంనగర్ రూరల్ మండలం, చేగుర్తి గ్రామంలో ఈరోజు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

గ్రామ కార్యదర్శి గోనె రాజ మల్లయ్య గారు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ గాలిపెల్లి సుజాత గార్ల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీమతి బాషవేని సరోజన మల్లేశం యాదవ్ గారు
MPDO . అశోక్ కుమార్ గారు
, ఉప సర్పంచ్ గాలిపెల్లి రవీందర్ గారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు శ్రీ బాషవేని మల్లేశం యాదవ్ గారు
APO శోభరణి
technical a/c రమాదేవి
విచ్చేసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెట్లను నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా వారు తెలిపారు.
🏠 Home