🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 25 Aug, 2026 | Page: 1

టీఎంసీ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులు

తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీల అనర్హతపై స్పీకర్ విచారణ జరపకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది.అనర్హత అంశంపై నిర్ణీత కాలవ్యవధిలోగా విచారణ జరపాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, ఈ విచారణ సందర్భంగా స్పీకర్‌కు నోటీసులు జారీ చేయొద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. రెబల్ ఎంపీలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేశారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.
🏠 Home