🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 25 Aug, 2026 | Page: 1

శ్రీశైలంలో ఒకే కుటుంబానికి చెందిన‌ ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌

పవిత్ర శైవక్షేత్రం శ్రీశైలంలోఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మ‌హ‌త్య‌కుపాల్ప‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. దైవదర్శనానికి వచ్చిన కుటుంబ స‌భ్యులు వ‌డ్డెర స‌త్రంలో ఇద్ద‌రు పురుషులు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోగా స్నానాల గ‌దిలో మ‌రో ముగ్గురు మ‌హిళ‌లు విగ‌త‌జీవులుగా ప‌డి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.మృతులుమల్లేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, సుధాకర్, మణికంఠగా గుర్తించారు పోలీసులు. ఆర్ధిక ఇబ్బందులతోనే బలవనర్మణం చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నామ‌ని ఆత్మ‌కూరు డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. వీరంతా ఏపీలోని సత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని బత్తులపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.
🏠 Home