🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 24 Aug, 2026 | Page: 1

సంగారెడ్డి ప్రైవేట్ హాస్టల్‌లో నర్సు సురేఖ ఆత్మహత్య..

ప్రియుడి మోజులో పడి కన్న తల్లిదండ్రులకే విషమిచ్చి హత్య చేసిన నర్సు సురేఖ చివరికి అదే తరహా విష ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామానికి చెందిన సురేఖ గతంలో తన తల్లిదండ్రులకు సూది మందు ద్వారా విషం ఇచ్చి హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవించింది. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆమె సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది.ఆదివారం హాస్టల్‌లోనే సురేఖ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనపై సంగారెడ్డి పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల హత్య కేసు, బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె పరిస్థితులు, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సురేఖ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
🏠 Home