🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 24 Aug, 2026 | Page: 1

పెద్దపల్లిలో ఉగ్ర లింకుల కలకలం..

పెద్దపల్లి జిల్లాలోని రామగుండంలో ఉగ్ర లింకులు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) తనిఖీల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. ఈ క్రమంలో రామగుండానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్‌ను NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ముజామిల్ ఖాన్‌కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ముజామిల్‌ను ఎన్‌ఐఏ అధికారులు.. ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులతో విద్యార్థికి ఎలాంటి లింకులు ఉన్నాయి, పరిచయాలు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.

🏠 Home