🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 24 Aug, 2026 | Page: 1

ఇంగ్లండ్ క్రికెట‌ర్ చేతికి బేడీలు

ఇంగ్లండ్ క్రికెట‌ర్ , ఫాస్ట్ బౌల‌ర్ బ్రైడ‌న్ కార్సే చిక్కుల్లో ఇరుక్కున్నాడు. శ‌నివారం రాత్రి నైట్‌క్ల‌బ్ వ‌ద్ద అత‌ను ఘ‌ర్ష‌ణ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. క్ల‌బ్ వ‌ద్ద పోలీసులు అత‌ని చేతుల‌కు బేడీలు వేశారు. ఈ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌తో జ‌రగ‌నున్న రెండో టెస్టు మ్యాచ్‌లో కార్సే ఆడ‌నున్నాడు. అయితే దుర్హ‌మ్ జ‌ట్టు స‌భ్యుడు మాథ్యూ పాట్స్ కూడా ఆ క్ల‌బ్ వ‌ద్ద ఉన్న‌ట్లు గుర్తించారు. డ‌ర్బీ క్ల‌బ్‌లో జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల ఆరా తీస్తున్నామ‌ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఈ కేసులో అప్‌డేట్ త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఈసీబీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

🏠 Home