తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. 6 నగరాల్లో డౌన్..
రియల్ మార్కెట్ ధోరణులు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఒక్కోసారి ఒక్కో నగరంలో కొనుగోళ్లు పెరగడం, మరో నగరంలో తగ్గడం జరుగుతుంటాయి. మరో త్రైమాసికం వస్తే పరిస్థితి మారిపోవచ్చు. ఇప్పుడు కూడా 2027 క్యాలెండర్ ఇయర్ ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక మార్పు కనిపిస్తోంది. ఈ సమయంలో ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్ తాజాగా ఏప్రిల్- జూన్ క్వార్టర్‌లో ఇళ్ల విక్రయాలకు సంబంధించిన రిపోర్ట్ విడుదల చేసింది. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు 6 శాతం తగ్గిపోయాయి.ఈ ఏడాదిలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో చూస్తే 8 ప్రధాన నగరాల్లో 91729 యూనిట్ల మేర విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో మాత్రం ఇళ్ల విక్రయాలు 97674 యూనిట్లుగా ఉన్నాయి. దీంతో 6 శాతం తగ్గుదల కనిపించిదని ప్రాప్‌టైగర్ వెల్లడించింది.