కొండా సురేఖపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె సొంత అభిప్రాయమంటూ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి స్పందిస్తూ.. కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలని అన్నారు.
సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ స్పందించాలి: బీర్ల ఐలయ్య
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మామూలే అని.. సొంత పార్టీ వాళ్లు విమర్శలు చేస్తే ఎలా అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎత్తిన జెండాను దించకుండా పార్టీని అధికారంలోకి తెచ్చింది రేవంత్ అని.. ఆయనపైన విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. సుస్మిత వ్యాఖ్యలపై కొండా సురేఖ స్పందించాలని డిమాండ్ చేశారు. కష్టపడుతున్న సీఎంపై బండలేస్తారా అంటూ మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే సీఎంపై విమర్శలు చేయడం బాధాకరమని ఐలయ్య అన్నారు.
సీఎంపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోం: వేముల వీరేశం
కుమార్తె సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలని ప్రభుత్వ విప్ వేముల వీరేశం అన్నారు. కొండా సురేఖ భాష పార్టీని ఇబ్బంది పెడుతోందని.. సమంత విషయంలో కూడా ఇలాగే మాట్లాడారని మండిపడ్డారు. ‘మీ తప్పుడు భాషకు సీఎం మూల్యం చెలించాలా? మీ ఎంటర్టైన్మెంట్ కోసం పార్టీ బలి కావాలా? అధికారంలోకి రావడానికి రేవంత్ చెమట చుక్కలు త్యాగం చేశారు. ముఖ్యమంత్రిని వీక్ చేయాలనే కుట్ర చేస్తున్నారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారంపై స్పందిస్తున్నాం. సీఎంపై ఎవరు తప్పుగా మాట్లాడినా చర్యలు తీసుకోవాలి. సీఎం నిర్ణయాలను తప్పు పట్టడం దుర్మార్గం. ఆయన నిర్ణయాలు తప్పు పట్టేవాళ్లు పార్టీలో ఉండాల్సిన అవసరం లేదు. సొంత పార్టీ నేతలు ప్రతిపక్షాలకు గొంతు ఇస్తున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన వారిని పక్కన పెట్టాలి. పార్టీ వేదికలపై మాట్లాడాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడతారా? మైక్ దొరికితే ఊగిపోతారా? సీఎంపై అసత్య ఆరోపణలు చేసినా, ఏకవచనంతో మాట్లాడితే ఊరుకోం’ అని హెచ్చరించారు.