🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 20 Aug, 2026 | Page: 1

" కులవృత్తులే సమాజానికి పునాది "

కరీంనగర్: విద్యా విభాగం:
స్థానిక ఎస్.ఆర్. ప్రైమ్ స్కూల్, జ్యోతి నగర్ నందు గల 7, 8 తరగతుల విద్యార్థులు గురువారం నాడు క్షేత్ర పర్యటనలో భాగంగా ఆరేపల్లి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని కుమ్మరివాడని సందర్శించి మల్లేశం అనే ఒక కుమ్మరి వద్ద నుండి విద్యార్థులు స్వయంగా కుండలు తయారు చేయడంలో గల వివిధ ప్రక్రియల్ని దగ్గరుండి తెలుసుకున్నారు. గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాన్ని కూడా సందర్శించి రైతుల ద్వారా పాడి పంటలకు సంబంధించిన జ్ఞానాన్ని ఆర్జించారు. పుస్తకాల్లో చదివిన అంశాల్ని ఇలా పల్లె వాతావరణంలో ప్రత్యక్షంగా చూడటం మాకెంతో ఆహ్లాదాన్ని కలిగించిందని విద్యార్థులు సంబరపడ్డారు. ఈ క్షేత్ర పర్యటనలో పాల్గొన్న ఆరేపల్లి 1.వ డివిజన్ కార్పొరేటర్ బారి అపర్ణ జితేందర్ గారు మాట్లాడుతూ " కులవృత్తులే సమాజానికి పునాది" అని విద్యార్థులు ఇలా గ్రామాన్ని సందర్శించడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు.
పాఠశాల డీజీఎం సచిన్ గారి ప్రోత్సాహంతో పాఠశాల ఎ.ఒ., కోఆర్డినేటర్, ఉపాధ్యాయుల సమక్షంలో జరిగిన ఈ విజయవంతమైన క్షేత్ర పర్యటన పట్ల ఎస్.ఆర్. విద్యాసంస్థల చైర్మన్ వరదా రెడ్డి గారు, డైరెక్టర్ సంతోష్ రెడ్డి గారు, హర్షం వ్యక్తం చేశారు.
🏠 Home