🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 20 Aug, 2026 | Page: 1

గద్వాల పట్టణంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగ‌లు.. బంగారం, నగదు అపహరణ

గద్వాల్ పట్టణంలోని 2వ వార్డులో పట్టపగలే ఓ టీచర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాదాపు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరించినట్లు బాధితులు చెబుతున్నారు..ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్,పట్టణ ఎస్ఐ కల్యాణ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పట్టణంలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
🏠 Home