🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 19 Aug, 2026 | Page: 1

టిమ్స్ హాస్పిట‌ల్ డొల్ల‌త‌నం బ‌య‌ట‌ప‌డుతుందనే భ‌యంతోనే హౌస్ అరెస్టులు

టిమ్స్ హాస్పిట‌ల్‌ డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే హౌస్ అరెస్ట్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. సనత్ నగర్ టిమ్స్ హాస్పిట‌ల్‌ కట్టింది నువ్వే అయితే హౌస్ అరెస్టులు ఎందుకు రేవంత్ అంటూ సూటిగా ప్ర‌శ్నించారు. టిమ్స్‌ హాస్పిట‌ట్‌ కట్టింది నేనే అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పుకుంటూ, సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. కాగా, సనత్ నగర్ టిమ్స్ ద‌వాఖాన సందర్శనకు వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో గృహనిర్బంధం చేశారు. అలాగే మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మన్నె క్రిశాంన్‌ను సైతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట్‌లోని హరీశ్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

🏠 Home