ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది టెన్త్ క్లాస్ విద్యార్థులే..!
నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసింది ఆమె చదువు చెప్పిన విద్యార్థులేనని పోలీసులు నిర్ధారించారు. గంజాయి, విచ్చలవిడిగా జల్సాలకు అలవాటుపడి డబ్బుల కోసం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేశారు. ఆమె స్కూల్ ముగించుకొని ఇంటికి వచ్చే సమయానికి అంతకంటే ముందే గోడ దూకి రూపారెడ్డి ఇంట్లోకి నిందుతులు చొరబడ్డారు.