వడ్డెర కులాన్ని తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలి
వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ డిమాండ్.
దేవరకొండ 18ఆగస్టు (BVK 3 న్యూస్ ) :
ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర వెనుకబాటుతనానికి గురైన వడ్డెర కులస్తులను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 40 సంవత్సరాలుగా వడ్డెర కులస్తులు తీవ్రమైన పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్ళు కొట్టడం, కంకర కొట్టడం, ప్రాజెక్టుల్లో కఠినమైన కూలీ పనులు చేసుకోవడం తప్ప తమకు ఎలాంటి భూములు, ఆస్తులు లేవని స్పష్టం చేశారు. రోజువారీ కూలికి వెళ్తేనే ఇల్లు గడిచే దయనీయ స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
ఉపాధి లేక యువత ఆత్మహత్యలు:
సమాజంలో వడ్డెర కులంలో కేవలం 5 శాతం మంది మాత్రమే చదువుకోగలుగుతున్నారని, తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను చదివించినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో సరైన రిజర్వేషన్లు లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని తెలిపారు. సరైన గుర్తింపు, ఉపాధి దక్కక తీవ్ర మనోవేదనతో ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనలు ఉన్నాయని గుర్తుచేశారు.
ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి:
గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పర్యటనల సందర్భంగా వడ్డెరల సమస్యలను గుర్తించి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్టీ జాబితాలో చేరుస్తామని బహిరంగ సభల్లో, మునుగోడు ఎన్నికల ప్రచారంలోనూ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ అమలుకు నోచుకోకపోవడం దారుణమన్నారు.
తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఐలమల్లు నేతృత్వంలో గత 9 సంవత్సరాలుగా మంత్రులు, ప్రజాప్రతినిధులను కలిసి అనేక వినతిపత్రాలు అందజేసినా, ధర్నాలు నిర్వహించినా ప్రభుత్వాల నుంచి సరైన స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి, వడ్డెర కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేలా కేంద్రానికి సిఫారసు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను విస్మరిస్తే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.