నేదునూరి పిలుపు
మనసుతో భేరసారాలు వద్దు
సంకల్పంతో పనిచేయడమే
ముద్దు
మనిషి
మనసు కోరికలపుట్ట
కోరికలు అపరిమితం
కోరికలు తీర్చుకోవడంలో
పోటీపడతాడు
మనసుతో ఎప్పుడూ
బేరసారాలు ఆడకూడదు
మెదడు ఎప్పుడూ
సుఖాన్ని కోరుకుంటుంది
గొప్ప విజయాలు
సాధించాలంటే ఆగిపో
నీవు చేయలేవు అని
ఆజ్ఞాపిస్తుంది
మనసు వినిపించే మాటలు
ఖాతరు చేయక కర్తవ్యాన్ని
పూర్తి చెయ్యాల్సిందే
సంకల్పంతో ముందుకు
సాగాల్సిందే
ఓ యువతా!
ఆలోచనల అలజడిలో
అడుగులు తడబడనీయకు
క్షణం క్షణం మారే మనసుతో
భేరసారాలు చేయకు
ఓయువతా !సాకులు
వెతకకు పనియే
నీ జీవనశైలి కావాలి
సోమరితనానానికి
స్వస్తి పలకాలి
వాయిదా వేసే
మనస్తత్వాన్ని వీడాలి
ఓటమి కంటే పనిని
వాయిదా వేసే
మనస్తత్వమే ఎక్కువ
నష్టాన్ని కలిగిస్తుంది
సాధించాలనే బలమైన
సంకల్ప మే యువత
శ్వాస కావాలి
భారత మాత గడ్డపై
నవశకాన్ని ప్రారంభించు
యువతరం మేలుకో
ప్రగతిని ఏలుకో
దీక్ష పట్టుదల ఆయుధమైతే
విజయాలు నీవశమౌతాయి
నిరాశ నిస్పృహలు చీల్చుకుంటూ
అభివృద్ధి మార్గాన పయనించాలి
మనసు ఒక మాయాజాలం
దాన్ని అంచనావేయడం కష్టం
మనసు ఆజ్ఞలకు లొంగిపోవద్దు
చేసే పనిలో శ్రద్ధ నైపుణ్యంతో
ప్రగతి పురోగతి మార్గాన
ముందుకు సాగిపోవాలి
మీ ప్రతిభను సమాజ ప్రగతికి
ఉపయోగించండి
సమాజములో ఉన్న చీకటిని
పారదోలండి
ఓ యువతా సాకులు
వీడి ముందుకు సాగిపో
సంకల్పమే శ్వాసగా
దేశ ప్రగతికి బాటలు వేయు
నీశ్రమతో నవ భారతాన్ని నిర్మించి
వికసిత భారత్ లక్ష్యంగా సాగిపో
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
ఆర్థికవేత్త రచయిత కాలమిస్ట్
కరీంనగర్94402345771
సంకల్పంతో పనిచేయడమే
ముద్దు
మనిషి
మనసు కోరికలపుట్ట
కోరికలు అపరిమితం
కోరికలు తీర్చుకోవడంలో
పోటీపడతాడు
మనసుతో ఎప్పుడూ
బేరసారాలు ఆడకూడదు
మెదడు ఎప్పుడూ
సుఖాన్ని కోరుకుంటుంది
గొప్ప విజయాలు
సాధించాలంటే ఆగిపో
నీవు చేయలేవు అని
ఆజ్ఞాపిస్తుంది
మనసు వినిపించే మాటలు
ఖాతరు చేయక కర్తవ్యాన్ని
పూర్తి చెయ్యాల్సిందే
సంకల్పంతో ముందుకు
సాగాల్సిందే
ఓ యువతా!
ఆలోచనల అలజడిలో
అడుగులు తడబడనీయకు
క్షణం క్షణం మారే మనసుతో
భేరసారాలు చేయకు
ఓయువతా !సాకులు
వెతకకు పనియే
నీ జీవనశైలి కావాలి
సోమరితనానానికి
స్వస్తి పలకాలి
వాయిదా వేసే
మనస్తత్వాన్ని వీడాలి
ఓటమి కంటే పనిని
వాయిదా వేసే
మనస్తత్వమే ఎక్కువ
నష్టాన్ని కలిగిస్తుంది
సాధించాలనే బలమైన
సంకల్ప మే యువత
శ్వాస కావాలి
భారత మాత గడ్డపై
నవశకాన్ని ప్రారంభించు
యువతరం మేలుకో
ప్రగతిని ఏలుకో
దీక్ష పట్టుదల ఆయుధమైతే
విజయాలు నీవశమౌతాయి
నిరాశ నిస్పృహలు చీల్చుకుంటూ
అభివృద్ధి మార్గాన పయనించాలి
మనసు ఒక మాయాజాలం
దాన్ని అంచనావేయడం కష్టం
మనసు ఆజ్ఞలకు లొంగిపోవద్దు
చేసే పనిలో శ్రద్ధ నైపుణ్యంతో
ప్రగతి పురోగతి మార్గాన
ముందుకు సాగిపోవాలి
మీ ప్రతిభను సమాజ ప్రగతికి
ఉపయోగించండి
సమాజములో ఉన్న చీకటిని
పారదోలండి
ఓ యువతా సాకులు
వీడి ముందుకు సాగిపో
సంకల్పమే శ్వాసగా
దేశ ప్రగతికి బాటలు వేయు
నీశ్రమతో నవ భారతాన్ని నిర్మించి
వికసిత భారత్ లక్ష్యంగా సాగిపో
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
ఆర్థికవేత్త రచయిత కాలమిస్ట్
కరీంనగర్94402345771