చిట్టీల పేరుతో రూ.70 లక్షల మోసం?...
గుడివాడ ఎన్టీఆర్ కాలనీలో చిట్టీల పేరుతో సుమారు రూ.70 లక్షల మేర మోసం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. గత 20 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తున్న దంపతులు.. పేదలు కష్టపడి దాచుకున్న డబ్బులను ఎగ్గొట్టి ఇల్లు ఖాళీ చేసి పారిపోయేందుకు ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారిని బాధితులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రోడ్డు పక్కన చేపలు అమ్ముకునే వారు, ఇళ్లలో పనిచేసే వారు, ఇతర రోజువారీ కూలీలు, పేద కుటుంబాలే ఈ చిట్టీలకు ప్రధానంగా డబ్బులు చెల్లించినట్లు బాధితులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా చిట్టీలు నిర్వహిస్తూ తమ నుంచి డబ్బులు వసూలు చేశారని, ఇప్పుడు చిట్టీ డబ్బులు తిరిగి ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చిట్టీ డబ్బులు అడిగిన సమయంలో నిర్వాహకుల కుటుంబ సభ్యులు తమతో గొడవకు దిగేవారని బాధితులు తెలిపారు. తమకు జరిగిన మోసంపై సుమారు 15 రోజుల క్రితమే గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.