🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 16 Aug, 2026 | Page: 1

పులికుంట్లలో అనారోగ్య బాధితుడికి 'కెఎంపి హెల్పింగ్ హండ్స్' ఆర్థిక సహాయం

దేవరకొండ 16ఆగస్టు (BVK 3 న్యూస్ ) : నాంపల్లి మండలం పులికుంట్ల గ్రామానికి చెందిన గిరి- చోటు ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందాడు. ప్రస్తుతం స్వగ్రామం పులిగుంట్ల వచ్చాడు. కెఎంపి హెల్పింగ్ హాండ్ సభ్యులు గిరి ఇంటికి ఆదివారం వెళ్లి పరామర్శించారు .కే ఎంపీ హెల్పింగ్ హాండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున 14 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏరుకొండ రాము, కూన భానుచందర్, ఎండి లతీఫ్, సంగెపు మురళి, సైదులు, ముదిగొండ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home