🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 14 Aug, 2026 | Page: 1

సంక్షోబాల నుండి సమృద్ధివైపు

(ఆగస్టు 15 భారత దేశ 80 వ
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా
రాసిన కవిత)
ఎనిమది శతాబ్దాల
స్వాతంత్ర్య భారత్
ప్రగతి భాటలో
సాగుతున్న వేళ
పలు సంక్షోభాల
వలయంలో దేశం
చిక్కుకుపోయింది
పేదరికం నిరుద్యోగం
ద్రవ్యోల్బణం
ఆర్థిక మాంద్యం
ధరల పెరుగుదల
ఆకలి కేకలు
దేశ ప్రగతిని
వెక్కిరిస్తున్నాయి
వ్యవసాయరంగం కుదేలైంది
గిట్టుబాటు ధరలు లేక
మార్కెట్లో దళారుల
దోపిడి పెరిగింది
రైతాంగం అప్పుల ఊబిలో
చిక్కుకొని ఆత్మహత్యలకు
పాల్పడుతున్నారు
నైతిక విలువలు క్షీణించాయి
ప్రాంతీయ మత విద్వేషాలు
సామాజిక శాంతికి భంగం
కలిగించే సంఘటనలు
ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు
మానవ తప్పిదాలు మరో వైపు
పోటీ పడి కాలుష్యాన్ని
పెంచుతున్నాయి
సంక్షోభాలను నివారించాలి
సరి కొత్త భారతాన్ని నిర్మించాలి
యువత నైపుణ్యాలతో
నవ శకాన్ని నిర్మిద్దాం
రైతే రాజును చేసే
ప్రణాళికల అమలుకు
పూనుకుందాం
ఐక్యత అనే ఆయుధంతో
సామాజిక విభేదాలను
అరికడుదాం
సంక్షోభాల భారతాన్ని
సమృద్ధి భారత్ గా
మార్చుదాం
సంక్షోభాల చీకట్లు
ఎంత దట్టంగా ఉన్నా
పౌరసమాజం ఐక్యత
సంకల్పం ముందు
పటా పంచలు కాక తప్పదు
సవాళ్లను అవకాశాలుగా
మలుచుకుంటూ
నైతిక విలువల బాటలో
నవభారత నిర్మాణానికి
పునరంకిత మౌధం
నేదునూరి కనకయ్య
( కల్యాణ్)
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
రచయిత కాలమిస్ట్
కరీంనగర్9440245771
🏠 Home