🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Aug, 2026 | Page: 1

నేదునూరి పిలుపు

రేపటి భారతం
మన చేతుల్లో
(ఆగస్ట్15వ తేదీ' 80వస్వాతంత్ర
భారత్ దినోత్సవం సందర్భంగా
రాసిన కవిత)
8దశాబ్దాల భారత్
అనేక సమస్యలతో
కూరుకుపోయింది
శాస్త్ర సాంకేతికత
ఆర్థిక రంగంలో
అంతరిక్షంలో
అగ్రశేణి స్థాయికి
ఎదిగింది
పేదరికం నిరుద్యోగం
సమాజ ప్రగతికి
అవరోధమైంది
రెక్కాడితే డొక్కాడని
బతుకులు మారాలి
స్వశక్తితో యువత
ఆర్థికరంగంలో ఎదగాలి
సామాజిక ఆర్థిక విద్య
వైద్య ఉపాధి అవకాశాలు
విస్తరించాలి ప్రజల జీవన
ప్రమాణాలు మారాలి
స్వయం ఉపాధి మార్గంగా
పేదరికంపై కలిసి కట్టుగా
పోరాడుదాం దేశ స్థితిని
గతిని మార్చుదాం
బాలకార్మికులు లేని
భారతాన్ని నిర్మిద్దాం
బాలలు పనిలో ఉండద్దు
బాలలను బడి బాట
పట్టిద్దాం వారికి బంగారు
భవిష్యత్తు నిద్ధాం
యువతలో నైపుణ్యానికి
పెద్దపీటవేద్దాం ఆత్మనిర్భర
భారత్ ఆవిష్కరణకు
అనుకూల వాతావరణం
కల్పిద్దాం ఉపాధి ఉత్పాదకత
ఆదాయాల సృష్టితో ఆర్థికవృద్ధికి
పాటుపడుదాం దేశాన్ని ఆర్థిక
రంగంలో అగ్రస్థాయికి చేర్చుదాం
నమ్మకమైన విద్య
వ్యవస్థను నిర్మిద్దాం
విజ్ఞాన దీపాలు వెలిగిద్దాం
అజ్ఞానపు చీకట్లను
పారదోలుదాం
ప్రకృతిని రక్షిద్దాం
పర్యావరణాన్ని కాపాడుదాం
ప్లాస్టిక్ రక్కసిని దూరం చేద్దాం
పచ్చదనం పరిశుభ్రతకు
పాటుపడుదాం
ప్రజారోగ్యాన్ని సంరక్షిద్ధాం
స్వచ్ఛ భారత స్వస్థ
భారత్ నిర్మిద్దాం
మొక్కలు నాటుదాం
హరిత భారత్ ను నిర్మిద్దాం
పునరుత్పాదక ఇంధన
వనరుల బాటలో
ప్రకృతిని రక్షిద్దాం
ప్రగతి పురోగతికి
పాటుపడుదాం
వికసిత భారత్ లక్ష్య సాధనకై
ఒక్కటై కదలాలి పౌరసమాజం
హక్కుల కొరకు పోరాడే
ప్రతి ఒక్కరు బాధ్యతలను
గుర్తుంచుకోవాలి
దేశం నాకేమిచ్చింది అనేది
కాదుదేశానికి నేను ఏమి
ఇచ్చాను అనే స్పహతో ప్రజల
మనో వైఖరిలో మార్పు రావాలి
అవినీతి రహితపాలన
నేరమయరాజకీయాలకు
పార్టీ ఫిరాయింపులకు
చరమగీతం పాడాలి
ప్రగతి శీల ప్రజాప్రతి
నిధులకు పట్టం కట్టాలి
మహిళ యువజన
సాధికారిత దిశవైపు
పాలకులు పాటుపడాలి
నిజాయితీతో కూడిన కర్తవ్య
పాలనా సంస్కరణలతో
దేశాన్ని నడిపించాలి
సవాళ్లు ఎన్ని ఎదురైన
సంకల్పం ముందు చిన్నవే
అని నిరూపిద్ధాం
యువతరం మేల్కొవాలి
నవ భారతాన్ని నిర్మించాలి
రేపటి భారతం మనచేతుల్లోనే
ఉంది అన్న సామాజిక
స్పృహను మరవద్దు
జాతీయత స్ఫూర్తిని వీడద్దు
సవాళ్లను దాటుకుంటూ
సమ సమాజ స్థాపన దిశగా
సాగుదాం
రేపటి భవ్య దివ్యభారత్
స్వదేశీ ఆత్మనిర్భరతతో
స్వావలంభ భారత్ ను
నిర్మిద్దాం సుస్థిరాభివృద్ధితో
సువర్ణ భారత ను ఆవిష్కరిద్ధాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
ఆర్థికవేత్త రచయిత
కాలమిస్ట్
మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
తెలంగాణ వికాస వేదిక
కరీంనగర్9440245771
🏠 Home