🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 13 Aug, 2026 | Page: 1

మ‌హ‌బూబాబాద్ జిల్లాలో పుష్‌పుల్ రైలు ఢీకొని టీచ‌ర్ మృతి

మ‌హ‌బూబాబాద్ జిల్లాలోవిషాదం చోటు చేసుకుంది. పుష్‌పుల్ రైలు ఢీకొని ఉపాధ్యాయుడు దుర్మ‌ర‌ణం చెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. మైనార్టీ గురుకుల పాఠ‌శాల‌లో మ్యాథ్స్ టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్న ఎండీ గౌస్‌మియా మ‌హ‌బూబాద్ రైల్వే స్టేష‌న్‌లో ప‌ట్టాలు దాటుతుండ‌గా రైలు ఢీకొని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. గౌస్‌మియా మృతిప‌ట్ల ప‌లువురు సంతాపం తెలిపారు.
🏠 Home