🏠 bvknews.com
Watermark
Newspaper Logo
bvknews.com | Date: 11 Aug, 2026 | Page: 1

యువతరం _ ప్రగతి రథ సారథులు

(నవ నైపుణ్యాలతో యువతకు ఉపాధి)
(ఆగస్ట్12 అంతర్జాతీయ
యువజన దినోత్సవం
సందర్భంగా)
"భారత దేశ భవిష్యత్తును మార్చ గలిగేది యువత"
_స్వామి వివేకానంద
ఒక్క దేశం యొక్క భవిష్యత్తు
ఆ దేశ యువతపైన ఆధారపడి ఉంటుంది. స్వామి వివేకానంద అట్లు నాకు వందమంది శక్తివంతమైన యువకులని ఇవ్వండి నేను ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తాను‌ అంటాడు.
ప్రస్తుత ఆధునిక సమాజంలో అంతర్జాతీయ యువజన సంవత్సరానికి జరుపుకుంటున్న తరుణంలో రాజకీయాలలో యువత పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. నేటి యువత కేవలం ఓటర్లు గానే కాకుండా రేపటి పాలకులుగా మార్చవలసిన సమయం ఆసన్నమైంది.
2026 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క అధికారిక థీమ్
భిన్నమైన సందర్భాలు ఉమ్మడి ఆకాంక్షలు( Different contexts Aspirations)
ఐక్యరాజ్యసమితి ఈ థీమ్ ను ప్రకటించింది.ముఖ్య ఉద్దేశాలు
విభిన్న జీవన పరిస్థితులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతీ యువకులు వేరు వేరు భౌగోళిక ప్రాంతాలు ఆర్థిక వనరులు సంస్కృతులు మరియు సామాజిక నేపథ్యంలో జీవిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడిన భూపరివేష్టిత మరియు చిన్న ద్విప దేశాల్లో యువత మరిన్ని సవాలని ఎదుర్కొంటున్నారు.
ఉమ్మడి ఆకాంక్షలు
జీవించే పరిస్థితులు వేరైనా ప్రపంచంలోని ప్రతి యువకుడి లక్ష్యాలు మరియు ఆశలు ఒకేలా ఉంటాయి. గౌరవప్రదమైన జీవితం నాణ్యమైన విద్య మంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు నిర్ణయాధికారంలోభాగస్వామ్యం భవిష్యత్తు కల్పించాలి.
యువత దేశభవిత
యువత దేశ భవిత . దేశ పురోగతి యువత పై ఆధారపడి ఉంటుంది. యువ శక్తి ని మించిన శక్తి ఈ భూమండలం మీద ఏదీ లేదనేది వాస్తవం. దేశాభివృద్ధి పురోగతిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది.యువత దేశం యొక్క కలిమి 'బలిమి దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న యువతలో నైపుణ్యాలు కొరవడి కోటి ఆశలతో ఉపాధి వేటకు సిద్ధమవుతున్న యువ శక్తి తీవ్ర బంగ పాటుకు గురై నిరాశ' నిస్పృహల్లో కూరకు పోతున్నారని' ఉపాధి రహిత వృధ్దిని.ఆక్షేపిస్తూ ఐ' ఎల్ 'ఓ తన తాజా నివేదికలో వెల్లడించడం దేశములో యువ శక్తి నిర్వీరీతకు నిదర్శనం కావడం శోచనీయం.
పెరిగిన నిరుద్యోగిత దశబ్దాల ప్రణాళిక ప్రగతి ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన ప్రగతి సాధించి ప్రపంచలో 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికి దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని నిర్మూలించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.దేశములో అమలైన పారిశ్రామిక విధానం పెట్టుబడి విధానం ఆర్థిక విధానం ఉపాధి రహిత అభివృద్ధిని పెంచింది .నిరుద్యోగిత పెరిగింది .దేశంలో 2000 సంవత్సరం లో యువతలో 5.7 శాతం వున్న నిరుద్యోగిత 2022 నాటికి 12'1శాతానికి పెరిగింది. 83 శాతం యువత నిరుద్యోగ శ్రామిక శ్రేణిలో వుండడం శోచనీయం.
దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గనున్న యువ జనాభా
మరో వైపు దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో జనాభాలో యువత శాతం తగ్గుతుందని తాజా అంతర్జాతీయ నివేదిక తెలిపింది. విద్యావంతులు చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాల్లో భవిష్యత్తులో శ్రామిక మార్కెట్లో డిమాండ్ పెరిగే సూచనలు ఉన్నాయి. మార్కెట్లో డిమాండుకు అనుకూలంగా యువ కార్మిక బలం అందుబాటులో ఉండదని ప్రపంచ కార్మిక సమాఖ్య 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో" భారత ఉపాధి నివేదిక_2024 "లో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
తెలంగాణ _నిరుద్యోగం
నీళ్ళు నిధులు నియామకాలే ద్యేయంగా ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వం నియామకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల నిరుద్యోగిత పెరిగింది.
తెలంగాణలో 15-29య
ఏళ్ల వయసులో వున్న చదువుకున్న యువత77.7 శాతం ఉన్నపటికీ వారికి సరిపడే ఉద్యోగాలు లేవు చాలా మంది యువత ఉపాధికి దూరంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. తెలంగాణలో 15-29 ఏళ్ల వయసులో 30 శాతం యువతులు 18 శాతం యువకులు నిరుద్యోగంలో మగ్గిపోతున్నట్లు వెల్లడించింది.
పెరిగిన నిరుద్యోగిత రేటు
రాష్ట్రంలోని యువతలో నిరుద్యోగి రేటు 14.19 శాతం నుండి21.71 శాతానికి పెరిగింది. మహిళా కార్మిక బలం వాటా తక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.
యువకుల్లో నిరుద్యోగి రేటు 12.96 శాతం నుండి18.34 శాతానికి చేరితే యువతుల్లో ఏకంగా 17.65 శాతం నుండి 30.35 శాతానికి పెరిగింది అని నివేదిక తెలిపింది.
తెలంగాణలో తగనున్న యువ జనాభా 2039 నాటికి తెలంగాణలో15-29 సం" రాల వయసు ఉన్న జనాభా తగ్గనున్నది. దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల్లో తగ్గుదలఎక్కువవుంటుంది.తమిళనాడు' కేరళ' ఆంధ్రప్రదేశ్' కర్ణాటక రాష్ట్రాల్లో యువ జనాభాలో స్వల్ప తగ్గుదల నమోదైంది. భవిష్యత్తులో వృధులజనాభాపెరుగనున్నది. ఉత్తర భారత దేశంలో కూడా యువ జనాభా తగ్గుముఖం పట్టే పరిస్థితిలో వుందని అధ్యయనంలో తేలింది.
తెలంగాణలో యువ జనాభా
2021 రాష్ట్ర జనాభాలో వాటా 26.4 దేశ జనాభాలో వాటా2.7 శాతం 2030 నాటికి రాష్ట్ర జనాభాలో వాటా21.7 శాతం దేశ జనాభాలో వాటా2.4 శాతం‌' 2036 నాటికి రాష్ట్ర జనాభాలో వాటా 20.2 శాతం
దేశ జనాభాలో వాటా2.3 శాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అంచనాలు తెలుపుతున్నాయి.
పురుషుల ఉపాధి లో మెరుగు 2005లో పురుషుల ఉపాధి కల్పనలో 11 వ స్థానంలో వున్న తెలంగాణ 2022 నాటికి 2 వ స్థానానికి చేరింది.
మహిళా ఉపాధి సుచిలో 4 వ స్థానం నుండి 7 వ స్థానానికి పడిపోయింది.
ఉపాధి 'విద్య' శిక్షణకు దూరంగా ఉంటున్న యువత సంఖ్య పెరుగుతుంది.2005 లో 17.9 శాతం వుంటే ప్రస్తుతం27.54 శాతానికి పెరిగింది.
నైపుణ్యాలు తక్కువ
యువతలో కంప్యూటర్ నైపుణ్యాలు తక్కువ ఉన్నాయి. బేసిక్ కాన్సెప్ట్స్ మీధ అవగాహన లేదు.
పనిచేస్తూ చదువుకోవడం కోర్స్ పూర్తి అయ్యే నాటికి నూతన నైపుణ్యాలను ఒంటపట్టించుకొని ఉద్యోగ అర్హత సంపాదించడం అభివృధ్ది చెందిన దేశాలలో సహజం .భారత దేశంలో సొంత కాళ్ళ మీద నిలబెట్టే నైపుణ్యాలు మన దేశ విద్యార్థులకు అబ్బడం లేదు. ఏటా కోటి,20 లక్షల మంది పట్టభద్రులు ఉత్పత్తి అవుతున్నారు. ఇందులో మూడో వంతు మందికే ఉద్యోగ అర్హతలు వుంటున్నాయని నివేదిక తెలిపింది.
రంగాల వారిగా అవసరాలు ప్రణాళికలు ఉపాధి అవకాశాలు మదింపు దేశంలో రాబోయే 30 సంవత్సరాల్లో రంగాల వారీగా దేశ అవసరాలను ప్రణాళికలు రూపొందించి 'ఉపాధి అవకాశాలను మదింపు చేసి అందుకు తగ్గట్లు చదువులను ' వృత్తి విద్యలను ' ఉపాధి దోహక కోర్స్ లను సంస్కరించాలి.
స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు కృత్రిమ మేధా రొబోటిక్స్ 'వర్చువల్ 'డేటా సైన్స్ సాంకేతిక కోర్సులకు పటిష్టమైన పునాది వేయాలి. మార్కెట్ అవసరాలకు అనుకూలంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. ప్రకృతి పర్యావరణ రక్షణ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృధి పరచాలి. ప్రకృతి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను విస్తరించాలి. గ్రామీణ చేతి వృత్తులు ఆధునీకీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలి.నూతన పాఠ్యాంశాలు ప్రవేశ పెట్టాలి. విద్యా సంస్థల్లో స్కిల్ డెవలప్మెంట్ విభాగాలను ఏర్పాటు చేయాలి. విద్యార్థుల ఆసక్తిని గుర్తించి వారికి ఇష్టమున్న కోర్సు అభ్యసించే విధంగా పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. బోధన అధ్యయన అభ్యసన పరిశోధన ప్రక్రియలను బలోపేతం చేయాలి. విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలి.మానవ వనరుల అభివృద్ధి కి దోహదపడే విద్య' 'వైద్య రంగాలకు 'మౌలిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలి. యువతలో నవ నైపుణ్యాలు పెంచుకొని ప్రపంచంలో ఎక్కడైన ఉపాధి అవకాశాలను ఒడిసి పట్టే విద్యా ప్రణాళికల కార్యాచరణకు ప్రభుత్వం పూనుకోవాలి.
యువత రాజకీయాల్లో ప్రవేశించాలి
రాజకీయాలు కుళ్ళిపోయాయి అని విమర్శిస్తూ వాటికి దూరంగా ఉండటం వల్ల వ్యవస్థ ఎప్పటికీ మారదు.బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టడానికి నాటి యువత ఏ విధంగానైతే ప్రాణాలు అర్పించి పోరాడారో నేడు దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి వారసత్వం కుల రాజకీయాలను అంతమొందించడానికి నేటి యువత అదే స్థాయిలో నడుంబిగించాలి. రాజకీయాలు అనేవికేవలం పదవుల కోసం కాదని అది సమాజ సేవకు ఒక గొప్ప వేదిక అని యువత నిరూపించాలి.
యువతలోని నూతన ఆలోచనలు సాంకేతిక పరిజ్ఞానం నిర్భయత్వం అనేవి వృద్ధతరం యొక్క అనుభవంతో తోడైనప్పుడు దేశంఅప్రతిహతంగా ముందుకు సాగుతుంది. అంతర్జాతీయ యువజన సంవత్సరం సందర్భంగా మనమంతా ఒకటే నిర్ణయానికి రావాలి. యువత కేవలం ఓటు బ్యాంకు కాదు .దేశాన్ని నడిపించే పౌరహౌస్. చట్టసభల్లో యువత అడుగు పెట్టినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం లభిస్తుంది. నవభారత నిర్మాణం సాధ్యమవుతుంది.
యువత మేల్కొంటే దేశం గెలుస్తుంది. యువత పాలిస్తే భవిష్యత్తు వెలుగుతుంది.
యువతే దేశ భవిత అనేది
నినాదం కాకుండా యువతరం
ప్రగతి రథ సారుథులు కావాలి.
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనమిక్ ఫోరమ్ 9440245771
🏠 Home